Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైల్డ్ మిలన్ ఫ్యాషన్ ఎగ్జిషన్‌ను ప్రారంభించిన నటి నీలిమ ఇసై

Advertiesment
wild milan
, ఆదివారం, 12 జూన్ 2022 (14:46 IST)
వైల్డ్ మిలన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల పాప్ అప్ షోను నటి నీలిమ ఇసై, వాణి రఘుపతి వివేక్, అతియా ఖాన్, షణ్ముగప్రియ దినేష్, ఘున్ జైన్, ఎషిత, సిరి చందన తదితరులు కలిసి ప్రారంభించారు. స్థానిక చెన్నై రాయపేటలోని అమెథిస్ట్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. 
 
ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటుజరిగిన ఈ ఎగ్జిబిషన్‌లో భారతదేశం నలుమూలల నుండి ఆహారం, దుస్తులు, ఉపకరణాలు, స్థిరమైన వస్తువులు, పాదరక్షలు వంటి చిన్న తరహా వ్యాపారాలను కలిగి ఉన్న వైల్డ్ మిలన్ ప్రత్యేక పాప్-అప్ షోలో పాలుపంచుకున్నారు. చిన్నతరహా కుటీర పరిశ్రమలు లేదా వ్యాపారాలకు మద్దతు ఇచ్చి వారిని ప్రోత్సహించడమే ఈ వైల్డ్ మిలన్ మఖ్యోద్దేశ్యం. 
 
ఈ ప్రదర్శన ప్రత్యేకంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించే చిన్న తరహా వ్యాపారాల కోసం రూపొందించారు. ఇది వారి ఉత్పత్తులను సరసమైన ధరలో ప్రదర్శించడానికి వారికి ఒక ఫ్లాట్ ఫాంగా ఉపయోగపడనుంది.
webdunia
 
వైల్డ్ మిలన్ అనేక మంది యువ మరియు ప్రతిభావంతులైన వ్యాపారవేత్తల ఉత్పత్తులను ప్రదర్శిస్తూ భారతదేశం అంతటా మరిన్ని ప్రదర్శనలతో ముందుకు దూసుకెళుతోంది. వైల్డ్ మిలన్ ఈ వేసవి షాపింగ్ ఫెస్టివల్ డిజైనర్ దుస్తులు, పాదరక్షలు మరియు ఉపకరణాల నుండి ఆహారం, బొమ్మలు, కళ మరియు క్రాఫ్ట్, శాకాహారి చర్మ సంరక్షణ మరియు మరెన్నో పర్యావరణ అనుకూలమైన మరియు స్థిరమైన ఉత్పత్తుల వరకు మీ షాపింగ్ అవసరాలన్నింటినీ తీరుస్తుంది.
 
ఈ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ దుస్తులు బ్రాండ్లు అయిన పల్లవి వాగ్, వీఏఆర్ క్రియేషన్స్, సమైరా99, ఎస్ఎస్ క్యూరేటెడ్ స్టూడియో, జ్యోతి కలెక్షన్స్‌ను ప్రదర్శనకు ఉంచారు. అలాగే, డిజైన్ టౌన్, రాయల్ ఫ్యాషన్, లక్నో క్లోసెట్, అకూర్ హౌస్, షైన్ బోటిక్, సుస్టి మెన్స్ వేర్, ఆర్ బై ఏంజెల్, అరుషి, ఎస్ఆర్ సింధూజ డిజైన్స్, సోమధి ఖాదీ, ధారా, నిలయన్, క్లే వర్క్ స్టూడియోస్ వంటి అనేక డిజైనర్లు, షోరూమ్‌లను ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన కిరాతకులు