రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక షెడ్యూల్ గత కొద్దిరోజులుగా జరుగుతోంది. శంకర్ చిత్రాలు ఇండియా లెవల్‌లో వుంటాయి. అయితే ప్రపంచ లెవల్‌లో వెళ్ళేలా కథను తయారుచేశారు. రామ్ చరణ్‌కు ఇటువంటి అవకాశం రావడం అదృష్టంగా ఫీలవుతున్నారు.
ముఖ్యంగా ఇటీవలే రామ్ చరణ్ తన స్టాఫ్ పుట్టినరోజు వేడుకను ఆయన ఉపాసనతో కలిసి చేశారు. ఇందుకు ఆయన దగ్గర పనిచేసే స్టాప్ ఎంతో ఆనందించారు. అయితే ఈ సందర్భంగా శంకర్‌తో ఇప్పటివరకు ఎవరూ చేయని పాయింట్‌తో రామ్ చరణ్‌కు అవకాశం రావడం అదృష్టంగా ఆయన స్టాఫ్ ప్రశంసించారు.
కాగా, ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ ప్రస్తుతం కొద్దిగా గ్యాప్‌లో ఉంది. తదుపరి షెడ్యూల్ కోసం నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆమధ్య కొద్ది రోజులు క్రితం వైజాగ్‌లో షెడ్యూల్‌ని కాస్త మధ్య లోనే ఆపాల్సి వచ్చింది. బహుశా ఆ షూటింగ్ స్టార్ట్ చేస్తారా లేక వేరే ప్లేస్‌లో ప్లాన్ చేస్తున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.