Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా పెళ్ళిలో స‌మ‌స్య‌లు లేవు - నన్ను తెరపై చూడటం ఫాహాద్‌కి చాలా ఇష్టం- నజ్రియా నజీమ్

Nazriya Nazim,
, మంగళవారం, 7 జూన్ 2022 (18:20 IST)
Nazriya Nazim,
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.  జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం  భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో  హీరోయిన్ నజ్రియా మీడియాతో ''అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు. నజ్రియా పంచుకున్న ''అంటే సుందరానికీ' విశేషాలివి.

 
తెలుగులోకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు .. కారణం ?
నిజంగా నేను ఏదీ ప్లాన్ చేసుకోనండి. కథలు ఎంపిక విషయంలో కొంచెం పర్టిక్యులర్ వుండే మాత్ర వాస్తవమే. ఐతే చాలా మంది నేను రోజు కథలు వింటూ రిజెక్ట్ చేస్తూ ఉంటానని అనుకుంటారు (నవ్వుతూ). అది నిజం కాదు. కొన్ని కథలు మాత్రమే విన్నాను. అందులో 'అంటే సుందరానికీ' చాలా ఎక్సయిట్ చేసింది.

 
మీరు 'అంటే సుందరానికీ' కథ విన్నప్పుడు ఎగిరిగంతేసారని నాని గారు చెప్పారు. 'అంటే సుందరానికీ' లో అంత ఎక్సయిట్ చేసిన అంశం ఏమిటి?
కథ విన్నపుడు భాష గురించి అలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. 'అంటే సుందరానికీ' కూడా ఒక ఆడియన్ లానే విన్నా. కథ అద్భుతం అనిపించింది. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ .. ఇలా అన్నీ భావోద్వేగాలు వున్న ఒక కథలో కుదరడం చాలా అరుదు. 'అంటే సుందరానికీ' అంత అరుదైన కథ. ఇలాంటి కథ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది.

 
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టిన మీరు సడన్‌గా బ్రేక్ తీసుకోవడం ఎలా అనిపించింది ?
బ్రేక్ నేను ప్లాన్ చేసింది కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాను. టీవీకి పని చేశాను. ఒక రెండేళ్ళు వరుసగా సినిమాలు చేశాను. కొంచెం త్వరగానే పెళ్లి చేసుకున్నాను. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత దానికి సమయం కేటాయించాలని భావించాను. ఇంట్లో వుండటం, ప్రయాణాలు, ఇంటి పనులు చూసుకోవడం కూడా ఆనందంగా వుంది. అయితే ఫాహాద్ 'కథలు వినకుండా ఏం చేస్తున్నావ్'' అనేవారు (నవ్వుతూ). నన్ను తెరపై చూడటం ఫాహాద్ కి చాలా ఇష్టం, నాకంటే ఆయనే ఎక్సయిట్ గా వుంటారు. కొన్నాళ్ళుగా కథలు వింటున్నాను. ఐతే నేను ఆల్రెడీ చేసిన పాత్రలే చాలా వరకూ వచ్చాయి. చేసిన పాత్రే మళ్ళీ చేయడంలో ఎలాంటి ఎక్సయిట్ మెంట్ వుండదు కదా.. ఈ కారణంగా కథల ఎంపికలో నేను కొంత పర్టికులర్ గా ఉంటానని భావిస్తారు.  

 
'అంటే సుందరానికీ'లో డ్యాన్స్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది ?
నాకు డ్యాన్స్ అంటే భయం.  నటిస్తాను కానీ డ్యాన్స్ చేయమంటే మాత్రం అది సహజంగా రాదు(నవ్వుతూ). నాని డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు. నాని డ్యాన్స్ చూసి కంగారు పడ్డా. నేను ఎలాంటి స్టెప్ వేసినా బావుందని నాని, వివేక్ ఆత్రేయ ఎంకరేజ్ చేసేవారు. డ్యాన్స్ విషయంలో చాలా కష్టపడ్డాను. అయితే యాక్టర్ ని కాబట్టి ఆ కష్టాన్ని కనిపించనీయకుండా మ్యానేజ్ చేశా.

 
లీలా థామస్ పాత్రలో వున్న సవాళ్ళు ఏంటి ?
లీలా థామస్ పాత్రలో చాలా లేయర్ వున్నాయి. లోపల బాధ వున్నా అది బయటికి కనిపించనీయకూడదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. లీలా థామస్ కి నజ్రియాకి ఒక్క పోలిక కూడా లేదు.

 
చాలా పెద్ద సినిమాలు కూడా రిజెక్ట్ చేశారు కదా.. భవిష్యత్ లో సినిమాల ఎంపిక ఎలా ఉండబోతుంది ?
నాకు కథ చాలా ముఖ్యం. కథ తర్వాతే ఏదైనా. ముందు కథ బావుండాలి. 'అంటే సుందరానికీ' సినిమా చేయడానికి కూడా కారణం.. కథ అద్భుతంగా ఉండటమే.

 
నానితో పని చేయడం ఎలా అనిపించింది ?
నాని గ్రేట్ కోస్టార్. 'అంటే సుందరానికీ'  ప్రయాణంలో మేము మంచి ఫ్రండ్స్ అయిపోయాం. నాని గారికి  స్టార్ అనే ఫీలింగ్ వుండదు. చాలా సపోర్ట్ చేశారు. నా గురించి చాలా కేర్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కి నన్ను సంప్రదించిన మొదటి వ్యక్తి నాని. ''కథ వినండి.. టైం తీసుకోండి.. కానీ వద్దని మాత్రం చెప్పకండి'' అని చెప్పారు. (నవ్వుతూ).  నాని గారు చాలా నిజాయితీ గల యాక్టర్. అలాగే నరేష్ గారు, నదియా గారితో పని చేయడం కూడా గొప్ప అనుభవం. వారి నుండి చాలా నేర్చుకున్నా.

 
ఫాహాద్ గారు విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులు ప్రశంసలు అందుకుంటున్నారు.. మీరు ఆయన భార్య. అయిననప్పటికీ మీలో నటికి జలసీగా ఉండదా ?
వుండదు. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ కంటే గొప్పది ఏదీ కాదు.

 
మీ మ్యారేజ్‌లో ఏమైనా సమస్యలు ఎదుర్కున్నారా?  
లేదండీ. నిజానికి నేను కొంత డ్రామా కోరుకున్నాను. కానీ మాది చాలా సింపుల్ లవ్ స్టొరీ.

 
ఫాహాద్,మీరు దాదాపు ఒకే సమయంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.. ప్రత్యేకంగా ప్లాన్  చేస్తుకున్నారా ?
లేదండీ. మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ అని చెప్పుకోవాలి (నవ్వుతూ). మొదట నేను సైన్ చేశాను. తర్వాత పుష్ప వచ్చింది. అయితే ఈ రెండు కూడా గొప్ప కథలు కావడం మా అదృష్టం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా పట్ల ప్యాషన్ వుంది. సినిమాని ప్రేమిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ మేకర్స్ లాంటి గొప్ప నిర్మాణ సంస్థ నిర్మాణంలో సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

 
ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుతుంటారా ?
ఇద్దరు ఒకే వృత్తిలో వున్నప్పుడు తప్పకుండా సినిమాల గురించి చర్చ వస్తుంది. సినిమాల గురించి మాట్లాడతాం. సూచనలు తీసుకుంటాం. అయితే సినిమా వరకూ ఎవరి నిర్ణయాలు వారివే. 'అంటే సుందరానికీ' ట్రైలర్, టీజర్ ఫాహాద్ కి చాలా నచ్చాయి. సినిమా కోసం ఆయన కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 
దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి ?
వివేక్ చాలా నిజాయితీ గల దర్శకుడు. ఇకపై ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఓపెన్ డేట్స్ ఇచ్చేస్తా. ఆయన రైటింగ్ అద్భుతం. వివేక్ తో మరో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నా.

 
తెలుగులో నటించడం సవాల్ గా అనిపించిందా ?
కొత్త భాష అన్నప్పుడు తప్పకుండా సవాల్ వుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి ముందే పూర్తి స్క్రిప్ట్ నా దగ్గర వుంది. దివ్య అనే ట్రాన్స్ లేటర్  సహాయంతో ప్రతి డైలాగ్ ని నేర్చుకున్నాను. నా డైలాగే కాదు స్క్రిప్ట్ లో వున్న అన్ని పాత్రల డైలాగులు  నేర్చుకున్నా. ప్రతి పదానికి అర్ధం తెలుసుకున్నా. షూటింగ్ కి ముందే ప్రిపేర్ అవ్వడంతో  షూటింగ్ చాలా సులువుగా అనిపించింది.

 
మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి కారణం ?
డబ్బింగ్ విషయంలో చాలా పర్టికులర్ గా వుంటాను. నటించగానే నా పని అయిపోయిందని అనుకోను. మనం నటించిన దానికి మనమే డబ్బింగ్ చెబితేనే సంపూర్ణమని భావిస్తా. నేను ఏ భాషలో చేసినా సొంతగా డబ్బింగ్ చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తా.

 
ప్రోమో సాంగ్ మీకోసమే పెట్టారా ?
అది లీలా థామస్ కోసం పెట్టారు. (నవ్వుతూ) షూటింగ్ గ్రేట్ వైబ్ తో జరిగింది. షూటింగ్ వైబ్ ని ప్రోమో సాంగ్ తో ప్రేక్షకులతో పంచుకున్నాం.

 
ఓటీటీల రాకతో చాలా మలయాళీ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాయి.. దిన్ని ఎలా చూస్తారు ?
చాలా ఆనందంగా వుంది. థియేటర్ లో రాణించలేని సినిమాలు ఇక్కడ రాణించే అవకాశం ఏర్పడింది. అలాగే కొత్తకొత్త కథలు వస్తున్నాయి. ప్రయోగాత్మక కథలని చూపించే అవకాశం వచ్చింది. వెబ్ సిరిస్ కోసం  కొందరు సంప్రదించారు. అయితే కంటెంట్ అంత సంతృప్తికరంగా అనిపించలేదు.

 
అంటే సుందరానికీ తర్వాత మళ్ళీ మీరు తెలుగు సినిమా ఎప్పటికో గానీ చేయరు కదా .. అంటే సుందరానికీలో మీరు గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలు ఏమిటి ?
వెంటనే తెలుగు సినిమా చేయనని ఎవరు చెప్పారు(నవ్వుతూ) నాకు వెంటనే మరో తెలుగు సినిమా చేయాలని వుంది. మంచి స్క్రిప్ట్ రావాలని బలంగా కోరుకుంటున్నాను.

 
'అంటే సుందరానికీ' విడుదల దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ గా ఉందా ?
నిజానికి నా సినిమా విడుదలకు ముందు నాకు ఎలాంటి టెన్షన్ వుండదు. కానీ అంటే సుందరానికీ విషయంలో కొంచెం టెన్షన్ పడుతున్నా. ఇది నా మొదటి తెలుగు సినిమా అయినప్పప్పటికీ .. ప్రేక్షకులకు నేను బాగా తెలుసు. ఇది నా కమ్ బ్యాక్ మూవీ. డబ్బింగ్ కూడా చెప్పా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆందోళన వుంది. మలయాళంతో అయితే ఇలా ఉంటుందని నాకో జడ్జమెంట్ వుంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి జడ్జ్ మెంట్ కూడా అందడం లేదు. అందుకే కాస్త కంగారు గానే వుంది.

 
ఫాహాద్ ని పుష్ప లో చూసినప్పుడు ఎలా అనిపించింది ?
చాలా గర్వంగా అనిపించింది. ఫాహద్ భాష విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు. తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు భాష పట్ల ఆయన పడిన శ్రమ నాకు తెలుసు. పుష్ప లో ఆయన చేసిన పాత్ర అద్భుతంగా అనిపించింది. మేము పుష్ప తెలుగు వెర్షన్ ని చూశాం.

 
కులాంతర, మతాంతర వివాహాలపై మీ అభిప్రాయం ?
అన్నిటికంటే ప్రేమ గొప్పదని నమ్ముతాను. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా వుంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య వుండకూడదని కోరుంటాను. ఐతే కరోనా తర్వాత జీవితం చాలా చిన్నదని చాలా మందికి అర్ధమైయింది. ఇలాంటి విషయాలపై మొండిగా వుండటం అర్ధం లేదని అర్ధం చేసుకుంటున్నారు. జీవితంలో ఆనందంగా ఉండటమే ముఖ్యం.

 
తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలనీ వుంది ?
ఒక నటిగా నాకు చాలా స్వార్ధం వుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా అందరితో నటించాలని వుంటుంది. సత్యదేవ్ నటన అంటే కూడా ఇష్టం. అందరూ అద్భుతమైన నటులు. అందరికీ యూనిక్ స్టయిల్ వుంది.

 
దర్శకులు మీ దగ్గరికి ఎలాంటి కథతో రావాలి ?
పాత్ర, నేపధ్యం ఎలా వున్నా.. కథలో నిజాయితీ మాత్రం వుండాలి.

 
కొత్తగా చేస్తున్నా సినిమాలు ?
ఇంకా ఏదీ సైన్ చేయలేదు. కొన్ని కథలు వింటున్నా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువ‌త‌లో దేశ‌భ‌క్తి పెంపొందించేలా మేజ‌ర్ కార‌ణ‌మైనందుకు గ‌ర్వంగా వుంది - మేజ‌ర్ నిర్మాత‌లు అనురాగ్‌, శ‌ర‌త్‌