ఇటీవల హీరో నాని గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సుందరానికి చిత్రం చేసిన ఆయన ఆ సినిమా జూన్ 10న విడుదలకాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లో బిజీగా వున్న ఆయన కొన్ని వార్తలను క్లారిటీ ఇచ్చాడు. ఆమధ్య నేను టికెట్ల ధరలు పెంచడానికి వ్యతిరేకిని అంటే, అది అన్ని సినిమాలకు అనేసి రాసేశారు. ఆర్.ఆర్.ఆర్. వంటి సినిమాలకు వ్యతిరేకినికాను. మిగిలిన బడ్జెట్‌స్థాయి చిత్రాలు పెంచితే ప్రేక్షకులు చూడలేరని నా ఉద్దేశ్యం అని తెలిపారు.
అలాగే ఇటీవల మహేస్‌బాబు, విజయ్ దళపతి సినిమాలలో తాను చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అవి ఎందుకు రాస్తారో నాకు అర్థంకాలేదు. నా డేట్స్ చూసేందుకు మేనేజర్ వున్నాడు. నాకు తెలియకుండా, ఆయనకు తెలీయకుండా కొత్త కొత్త కాంబినేషన్లు వీళ్ళు ఎలా సెట్ చేస్తారని వ్యగ్యోక్తి విసిరారు. త్రివిక్రమ్, మహేస్‌బాబు కాంబినేషన్‌లో నేను నటించడంలేదు. అదేవిధంగా విజయ్ సినిమాలోనూ నటించడంలేదు. మల్టీ స్టారర్ చిత్రాలకు నేను వ్యతిరేకినికాను. కానీ లేనిపోని వార్తలు రాసేవారికి వ్యతిరేకిని అంటూ క్లారిటీ ఇచ్చాడు.