Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీసుకున్నందుకు ఫ్రెండ్ భార్యతోనే ఎఫైర్ పెట్టుకున్నాడు, భార్య ఏం చేసిందంటే?

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (11:45 IST)
కోవిడ్ ఆర్థిక కష్టాల నేపధ్యంలో తన స్నేహితుడి వద్ద రూ. 2 లక్షలు అప్పు చేసాడు. ఐతే అప్పు వంకతో అతడు తరచూ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త అలా బయటకు వెళ్లగానే అతడికి ఇన్ఫర్మేషన్ ఇస్తుండేది. ఐతే వారి వ్యవహారాన్ని భర్త పసిగట్టాడు. ఇద్దరినీ మందలించాడు. ఐతే అతడు బ్రతికి వుండగా కలుసుకునే అవకాశం వుండదని, భార్య తన ప్రియుడి సాయంతో అంతమొందించింది.

 
పూర్తి వివరాలు చూస్తే... ఉత్తరప్రదేశ్ లోని బనారస్ కు చెందిన 40 ఏళ్ల మహ్మద్ ఇక్బాల్ పదిహేనేళ్ల క్రితమే గోల్కొండ రిసాలా బజార్ కు వచ్చాడు. ఏదో చిన్నచిన్న పనలు చేస్తుండే ఇక్బాల్ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు వచ్చాయి. దీనితో అదే ప్రాంతానికి చెందిన లతీఫ్ వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అలా లతీఫ్ అప్పుడప్పుడు ఇక్బాల్ ఇంటికి రావడం మొదలుపెట్టాడు.

 
ఈ క్రమంలో ఇక్బాల్ భార్య మెహరాజ్ బేగంపై కన్నేసాడు. ఆమెను లొంగదీసుకుని వివాహేతర సంబంధాన్ని సాగించాడు. ఐతే ఇది తెలిసిన ఇక్బాల్ ఇద్దరినీ మందలించాడు. తన ఇంటికి రావద్దని లతీఫ్‌ను హెచ్చరించి పంపాడు. ఇక తన భర్త బ్రతికి వుండగా కలుసుకునే వీలు వుండదని నిర్ణయించుకున్న మెహరాజ్ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన భర్తను చంపేయాలని లతీఫ్ కి చెప్పింది. దాంతో లతీఫ్ తనకు తెలిసిన ఉస్మాన్ సాయం కోరాడు. 

 
పనిపూర్తయితే రూ. 10వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఇక్బాల్ ను హత్య చేసారు. ఆ తర్వాత అతడి శవాన్ని ఈసీ నదిలో పడేసి వెళ్లిపోయారు. నదిలో నీరు తక్కువ వుండటంతో శవం పైకి తేలింది. స్థానికులు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ మృతుడి ఐడీ కార్డు లభ్యం కావడంతో దాని ఆధారంగా కేసును ఛేదించారు. అతడి భార్యతో సహా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments