Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలి.. ఫ్లెక్సీలు లేకుంటే పెళ్లిళ్లు జరగవా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (14:56 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన పళ్లికరణిలో ఓ ఫ్లెక్సీ కూలి బీటెక్ యువతి దుర్మరణం పాలైన కేసుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలనుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. పైగా, గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. 
 
పళ్లికరణి రహదారి డివైడర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పడి శుభశ్రీ (22) అనే బీటెక్ యువతి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలనుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. అక్రమ హోర్డింగ్స్ ఏర్పాటుపై గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు సీరియస్ అయింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు నిదీసింది.
 
తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే నిర్లక్ష్యమా అని హైకోర్టు ప్రశ్నించింది. ఫ్లెక్సీలు లేకుండా నేతల పెళ్లిళ్లు జరగవా అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. పైగా, చెన్నై బీచ్‌లో ఉన్న అన్ని రాజకీయ బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలంటే అధికారులకు లెక్కలేదా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మద్రాస్‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments