Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రయాన్-2'కు యేడాది - మరో ఏడేళ్ళకు సరిపడా ఇంధనం

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రాజెక్టు చంద్రయాన్-2. రెండో లూనార్ మిషన్‌గా పేరున్న చంద్రయాన్-2, చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టబడి గురువారానికి సరిగ్గా ఓ యేడాది పూర్తి చేసుకుంది. 
 
గత సంవత్సరం జూలై 22న చంద్రయాన్-2ను లాంచ్ చేయగా, దాన్ని ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరిక్షణంలో విఫలమైంది. ల్యాండ్ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో భూమిని బలంగా ఢీకొనడంతో ఈ ప్రయోగం విఫలమైంది. 
 
అయితే, చంద్రయాన్-2లోని ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తోంది. దీనిలో 8 రకాల శాస్త్రీయ పరికరాలు ఉన్నాయని, ఇవన్నీ ఇప్పుడూ సక్రమంగానే పనిచేస్తున్నాయని, ఇంతవరకూ చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 4,400 సార్లు పరిభ్రమించిందని ఇస్రో పేర్కొంది.
 
పైగా, ఇది చాలా చక్కగా పనిచేస్తోందని, విడిభాగాలన్నీ కూడా సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని తెలిపింది. ఈ ఆర్బిటర్‌లో మరో ఏడేళ్లకు సరిపడా ఇంధనం ఉందని, దీని ద్వారా చంద్రునిపై మరింత కాలం పాటు పరిశోధనలు సాగించవచ్చని, ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా దృష్టిపెట్టని చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తున్నామని ఇస్రో అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments