Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే ఏడాది నుంచి ఈ-పాస్‌పోర్టులు.. కేంద్రం రంగం సిద్ధం (video)

Advertiesment
వచ్చే ఏడాది నుంచి ఈ-పాస్‌పోర్టులు.. కేంద్రం రంగం సిద్ధం (video)
, గురువారం, 13 ఆగస్టు 2020 (14:37 IST)
భారతీయులందరికీ ఈ-పాస్‌పోర్టులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాస్‌పోర్ట్ తీసుకున్నవారితో పాటు కొత్తగా అప్లై చేయాలనుకునేవారికి శుభవార్త. 2021 నుంచి భారతీయులకు ఈ-పాస్‌పోర్టుల్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుందన్న వార్తలొస్తున్నాయి. అంటే వచ్చే ఏడాది నుంచి పాస్‌పోర్టులు ఇక ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోనే రానున్నాయి. 
 
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఓ ఏజెన్సీని ఎంపిక చేయనుంది. ఏజెన్సీని ఎంపిక చేసిన తర్వాత ఇ-పాస్‌పోర్టులు జారీ చేయడానికి కావాల్సిన ఐటీ వనరుల్ని సమకూర్చుకుంటారు. ఇవన్నీ పూర్తయ్యాక పాస్‌పోర్టుల్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో జారీ చేస్తారు. ప్రస్తుతం భారతీయులకు బుక్‌లెట్స్‌లో పాస్‌పోర్టుల్ని ఇస్తోంది ప్రభుత్వం. 
 
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్-ఐసీఏఓ ప్రమాణాల ప్రకారం ఇ-పాస్‌పోర్టుల్ని జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే 20,000 మంది అధికారులతో పాటు దౌత్యవేత్తలకు ఇ-పాస్‌పోర్టులు ఇచ్చింది. 
 
దేశంలోని 36 పాస్‌పోర్ట్ ఆఫీసుల్లో ఇ-పాస్‌పోర్టుల్ని జారీ చేయనుంది. ఏజెన్సీ ఇ-పాస్‌పోర్టు యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత గంటకు 10,000-20,000 ఇ-పాస్‌పోర్టుల్ని జారీ చేసే అవకాశముంది. ఇకపోతే.. ఇ-పాస్‌పోర్టులో ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్ ఉంటుంది.
 
నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రెస్, నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ సంయుక్తంగా ఈ చిప్స్ తయారు చేస్తున్నాయి. ఇందులో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ఈ పాస్‌పోర్టును ఫోర్జరీ చేయడం దాదాపుగా సాధ్యం కాదు. ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్న ప్రధాని మోడీ? ఎందుకో తెలుసా?