Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరాదిన కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ముంబైలో రహదార్లపై వరదనీరు

ఉత్తరాదిన కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ముంబైలో రహదార్లపై వరదనీరు
, సోమవారం, 27 జులై 2020 (11:59 IST)
Mumbai
ఉత్తరాదిన భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఇప్పటికే అస్సోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని లక్నోలోని వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 26 నుంచి 28 మధ్య ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బీహార్‌లలో, జూలై 27-29 మధ్య పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది.
 
బీహార్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పరిస్థితులు తలెత్తాయి. ఈ వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 10.6 లక్షలకు పైగా జనం నిరాశ్రయులయ్యారు. బాధితులకు సహాయక సామగ్రిని అందించేందుకు వైమానికదళ విమానాలు దర్భాంగా, తూర్పు, పశ్చిమ చంపారణ్‌, మధుబని గోపాల్‌గంజ్‌ప్రాంతాల్లో తిరుగుతున్నాయి.
 
తాజాగా సోమవారం ఉదయం నుంచి ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదర్ హింద్‌మాతలో రహదారిపై నీరు చేరడంతో ట్రాఫిక్ మళ్లించారు. దేశ వాణిజ్య నగరమైన ముంబైలో ప్రతీ ఏటా వర్షాలు భయాందోళనలకు గురిచేస్తాయని ప్రజలు వాపోతున్నారు. నీటితో ప్రాంతాలన్నీ నిండిపోవడంతో ముంబైలో వుంటున్నామా అనే భావన కలుగుతుందని వారు చెప్తున్నారు.
 
గత 15 ఏళ్ల క్రితం 2005లో ముంబైలో ఏర్పడిన వరదలు బీభత్సం సృష్టించాయని.. ఆ వరదలను తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని.. ఈ ఏడాది వర్షాలు ఎలా వుంటాయోనని భయపడుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వరం, దగ్గు, జలుబు.. వామ్మో నాకు కరోనావైరస్ వచ్చేసిందేమో? పరిశోధకుల సూచనలు