భారత్‌తో అణుయుద్ధం : పాక్‌ హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:27 IST)
భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని పాకిస్తాన్‌ హెచ్చరించింది. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది.

తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ అన్నారు. పాక్‌ టీవీ సామా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌పై భారత్‌ దాడికి దిగితే సంప్రదాయ యుద్ధానికి అవకాశం లేదని, ఇది భీకరంగా సాగే అణుయుద్ధానికి దారితీస్తుందని అన్నారు.
 
పాకిస్తాన్‌ సంప్రదాయ యుద్ధానికి దిగే అవకాశం లేదని, దీంతో ఏదైనా జరిగితే పొరుగు దేశం అంతమవుతుందని భారత్‌ గుర్తెరగాలని ఆయన హెచ్చరించారు.

కాగా పాకిస్తాన్‌ అణుయుద్ధం ప్రస్తావన తెస్తూ భారత్‌ను హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం భారత్‌తో అణు యుద్ధంపై గత ఏడాది పలు సందర్భాల్లో మాట్లాడారు.

ఇక కశ్మీర్‌ అంశంపై చైనా మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌ అంశంతో పాటు భారత్‌-చైనా సరిహద్దు ప్రతిష్టంభనలపైనా చర్చించేందుకు పాక్‌ విదేశాంగ మంత్రి మక్దూమ్‌ షా మహ్మద్‌ ఖురేషి బీజింగ్‌ పర్యటనకు బయలుదేరివెళ్లారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా తెల్లపోరి మొఖమే తిరుగుతుంటది.. అంటూ దీవాన సాంగ్

తర్వాతి కథనం
Show comments