Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక భారత్ కు విదేశీ ప్రయాణికుల రాక సులభతరం

ఇక భారత్ కు విదేశీ ప్రయాణికుల రాక సులభతరం
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (15:40 IST)
జీఎంఆర్ గ్రూపు ఆధ్వర్యంలోని ఢిల్లీ కన్సార్టియం అయిన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్  నేడు విదేశాల నుంచి భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికుల కోసం నూతనంగా ఎయిర్ సువిధ అనే పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు, ప్రయాణికులు తప్పనిసరిగా పూరించాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను దీనిలో పూర్తి చేయవచ్చని, ఇదే పోర్టల్‌లో వారు తప్పనిసరి ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఈ ఆన్‌లైన్ ఫామ్‌లను పౌర విమానయాన శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మరియు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో రూపొందించారు. మార్గదర్శకాల ప్రకారం ఈ సదుపాయం ఆగస్టు 8, 2020 నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటుంది.
 
ఎయిర్ సువిధ వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా జరిగి, ప్రయాణికులు తిరిగి వచ్చిన అనంతరం వివిధ ఫారాలను భౌతికంగా తాకే పని లేకుండా కాంటాక్ట్ లెస్ విధానంలో పూర్తి చేయవచ్చు.
 
ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయం ఒక అంతర్జాతీయ ప్రయాణ హబ్‌గా కొనసాగుతోంది. భారతదేశం పలు దేశాలతో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాక పెరిగే అవకాశం ఉంది. ఈ నూతన ఆన్‌లైన్ సెల్ఫ్ డిక్లరేషన్ మరియు క్వారంటైన్ మినహాయింపు పోర్టల్ వల్ల ప్రభుత్వ అధికారులు భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ మినహాయింపుపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది.
 
క్వారంటైన్ మినహాయింపు కోరే ప్రయాణికులు ఐదు నిర్ధిష్టమైన విభాగాల కింద ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వెబ్‌సైట్ www.newdelhiairport.in లో ఈ-ఫామ్‌ను నింపాలి. వారు తమ విమానాన్ని ఎక్కడానికి కనీసం 72 గంటల ముందు ఈ ఈ-ఫామ్‌ను ఇతర సంబంధిత డాక్యుమెంట్లు మరియు పాస్‌పోర్టు కాపీలతో సహా జత చేయాలి. అయితే ప్రయాణికులు పూర్తి చేయాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌కు మాత్రం ఎలాంటి కాలపరిమితీ లేదు. 
 
ఎయిర్ సువిధ పోర్టల్‌లో గత అప్లికేషన్ రిక్వెస్ట్ నెంబర్ ఆధారంగా రెండో అప్లికేషన్ ఆటో-ఫిల్ చేసుకునే సదుపాయం కారణంగా, ప్రయాణికులు ఒకే రకమైన సమచారం మరియు పత్రాలను పలువురు అధికారులకు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
 
మొదటి పోర్టు రాక ఆధారంగా అన్ని దరఖాస్తులూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆటో-రూట్ చేయబడతాయి. అదే విధంగా అన్ని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసుకు చేరతాయి.  
 
ప్రయాణికులు కోరిన మినహాయింపు ఇచ్చారా లేక తిరస్కరించారా అన్న వివరాలు ప్రయాణికులకు ఈమెయిల్ చేస్తారు. తప్పనిసరి ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందిన ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాక, ఎలాంటి సమస్యలూ లేకుండా ఇళ్లకు వెళ్లవచ్చు. దీని వల్ల మినహాయింపును పొందిన ప్రయాణికులకు మేలు జరగడమే కాకుండా, అధికారులు కూడా వేగవంగంగా ఫార్మాలిటీస్ పూర్తి చేసి, విమానాశ్రయంలోని అరైవల్ హాలులో ప్రయాణికులు గుమికూడడం నివారించబడుతుంది.
 
ప్రయాణికులు – గర్భిణులు, కుటుంబంలో ఎవరైనా మరణించినా, ఏదైనా తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నా (వివరాలు తెలపాలి), 10 ఏళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లల వెంట ఉన్న తల్లిదండ్రులు, ఇటీవలి RT-PCR పరీక్షలో కోవిడ్-19 నెగిటివ్ వచ్చిన వారు (ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రారంభించడానికి 96 గంటల లోపు) – ఈ ఐదు విభాగాలకు చెందిన వారు మాత్రమే మినహాయింపు పొందుతారు.

రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులకు వారిని తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు  కేస్-టు-కేస్ ఆధారంగా ఐధు విభాగాలకు చెందిన వారిని సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని ఎయిర్‌లైన్స్ నోటిఫై చేయవచ్చు.
 
ఎయిర్ సువిధ పోర్టల్‌పై శ్రీ విదేహ్ కుమార్ జైపురియార్, సీఈఓ-డిఐఎఎల్, ‘‘కోవిడ్-19 ఢిల్లీ విమానాశ్రయ నిర్వహణా విధానాన్ని మార్చేసింది. ప్రయాణికుల సౌకర్యం మరియు రక్షణపై మేమిప్పుడు ప్రధానంగా దృష్టిపెడుతున్నాము. ఈ మహమ్మారి సమయంలో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఎధుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ఢిల్లీ విమానాశ్రయం భారత ప్రభుత్వంతో కలిసి ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల శ్రేయస్సు కోసం ఈ చర్య తీసుకుంది.

క్వారంటైన్ మినహాయింపుకు ఆమోదం కలిగి ఉండడం వల్ల క్వారంటైన్ విధానం సులభతరం కావడమే కాకుండా, క్వారంటైన్ విధానంలో జరిగే ఆలస్యం కూడా నివారించబడుతుంది. అంతే కాకుండా ప్రయాణికులు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లను రెండు సార్లు పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉండదు’’ అన్నారు. 
 
ఉషా పాదీ, జాయింట్ సెక్రెటరీ, ఎంఓసీఏ, ఢిల్లీ విమానాశ్రయ దూరదృష్టిని ప్రస్తుతించారు. ‘‘అంతర్జాతీయ విమాన సేవల ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చే ప్రక్రియ గత కొంత కాలంగా సాగుతోంది. ఈ మహమ్మారి సమయంలో  ప్రయాణికులు వివిధ కారణాల వల్ల పరిమితమైన అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించాలనుకుంటున్నారు.

ప్రయాణికులు తమ ఆరోగ్యం గురించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం మరియు ప్రయాణికులకు ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టు డిజిటలైజ్, స్ట్రీమ్ లైన్ చేయడాన్ని మేం ఆహ్వానిస్తున్నాము. ఈ- ప్లాట్ ఫామ్‌ను దేశంలోని అన్ని విమానాశ్రయాలు ఉపయోగించుకోవడమే కాకుండా, దీని వల్ల ఆయా రాష్ట్రాలు/ఆరోగ్య అధికారులు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు తొందరగా క్లియరెన్స్ ఇవ్వగలుగుతారు. దీని వల్ల భారతదేశంలోని విమానాశ్రయాలలో విమానాల సంఖ్యను మరింత పెంచడానికి వీలవుతుంది’’ అన్నారు. 
 
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అంతర్జాతీయ విమానాల ద్వారా భారతదేశానికి వస్తున్న ప్రయాణికులంతా వారం రోజుల పాటు తమ సొంత ఖర్చుతో ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో, ఆ తర్వాత హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.  
 
ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీస్ ద్వారా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులంతా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. దీనిలో అత్యంత ఖచ్చితమైన, మాస్ స్క్రీనింగ్ కెమెరాల ద్వారా నిర్వహించే థెర్మల్ టెంపరేచర్ స్క్రీనింగ్ కూడా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేమింగ్ ప్రియుల కోసం... అసుస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్