ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాను బ్రిటీష్ ప్రభుత్వం త్వరలోనే భారత్‌కు అప్పగించవచ్చని తెలుస్తోంది. విజయ్ మాల్యాకు కాలపరిమితి ఇవ్వలేమని, ప్రజలకు న్యాయం జరిగేలా చూడటంలో న్యాయస్థానాల పాత్ర స్పష్టంగా ఉందని యుకె హైకమిషనర్ ఫిలిప్ బార్టాన్ అన్నారు.
మీడియాతో మాట్లాడిన ఫిలిప్ బార్టన్.. నేరస్తులు సరిహద్దులు దాటి వెళ్లినంతమాత్రాన తప్పించుకోలేరని స్పష్టం చేశారు. నేరస్తులకు సరైన శిక్ష విధించడంలో బ్రిటీష్ ప్రభుత్వం, కోర్టులు ఖచ్చితంగా ఉన్నాయని, నేరస్తులు న్యాయవ్యవస్థ నుండి తప్పించుకోలేరని బార్టాన్ అన్నారు.
మాల్యాను ఫిబ్రవరిలోనే భారత్‌కు అప్పగించాల్సి ఉండగా, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది.