Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలేషియా భద్రతా దళాల అదుపులో 60మంది భారతీయులు!

Advertiesment
మలేషియా భద్రతా దళాల అదుపులో 60మంది భారతీయులు!
, శనివారం, 27 జూన్ 2020 (08:21 IST)
మలేషియా భద్రతా దళాలు అదుపులో 60 మంది భారతీయులు వున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ భారతీయుడు కొవిడ్-19 లక్షణాలతో మరణించిన ఘటనపై స్పందించిన ఆ దేశ మానవ హక్కుల కమిషన్.. విచారణ చేపట్టింది.

తమిళనాడు, కేరళ, తెలంగాణకు చెందిన చాలా మంది.. హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఈ ఏడాది మార్చిలో కౌలాలంపూర్ వెళ్లారు. వీరంతా మార్చి రెండోవారం నాటికి తిరిగి ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే కరోనా విజృంభించడంతో మలేషియా ప్రభుత్వం మార్చి 18 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో హాలిడేస్‌ ఎంజాయ్ చేయడం కోసం వెళ్లిన సుమారు 60 మంది భారతీయులు మలేషియాలో చిక్కుకున్నారు.

ఇదే సమయంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం వేసిన మలేషియా ప్రభుత్వం..వారిని అదుపులోకి తీసుకోవడానికి భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కరోనా కారణంగా అక్కడే చిక్కుకున్న 60 మంది భారతీయులను కూడా అక్కడి భద్రతా దళాలు మే 1న అదుపులోకి తీసుకున్నాయి.

ఈ క్రమంలో భద్రతా దళాల అదుపులో ఉన్న చెన్నైకి చెందిన 67ఏళ్ల జీవ్‌దీన్ ఖాదర్ మస్తాన్ కొవిడ్ లక్షణాలతో మరణించారు. మలేషియా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న 60 మంది భారతీయుల్లో 20 మంది మహిళలు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పలాస ఘటనలో మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌