Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో అరలక్ష దాటిన కరోనావైరస్ మరణాలు

Advertiesment
దేశంలో అరలక్ష దాటిన కరోనావైరస్ మరణాలు
, సోమవారం, 17 ఆగస్టు 2020 (13:00 IST)
దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజుకి సుమారు వెయ్యిమంది కరోనాతో మృత్యువాతపడుతున్నారు. దీంతో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ సంఖ్య అరలక్షకు చేరుకుంది. అలాగే 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
 
గడిచిన 24 గంటల్లో తాజాగా 63,489 కరోనా కేసులు నమోదవగా, 944 మంది మృత్యువాతపడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మూడు రోజుల నుండి సుమారు వెయ్యిమంది కరోనా కారణంగా మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,89,682కు చేరగా, మృతుల సంఖ్య 49,980 కి చేరింది.

ఇక 6,77,444 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,62,258 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 71 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది. కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
 
ఏపీలో కొత్తగా 88 మంది మృతి
ఏపీలో గడ‌చిన 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 8,012 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. మరణాల సంఖ్య 2,650కు పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 48,746 నమూనాలను పరిశీలించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

గడ‌చిన 24 గంటల్లో 10,117 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు పేర్కొంది. అలాగే కరోనా కారణంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు.

కర్నూలు, నెల్లూరు తొమ్మిది, అనంతపురం, పశ్చిమ గోదావరి ఎనిమిది మంది, విశాఖపట్నం ఏడుగురు, గుంటూరు, కడప ఆరుగురు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28.60 లక్షల శాంపిళ్లను పరీక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంచలన నిర్ణయం తీసుకున్న ఇస్రో.. ఏంటది?