Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ల కోసం హైదరాబాద్ సంస్థ రూ.1500 కోట్లతో ఒప్పందం

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:19 IST)
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా, కీలకంగా మారిన వ్యాక్సిన్ల కొరతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత నెలకొనివుంది. దీన్ని అధిగ‌మించ‌డానికి కేంద్ర స‌ర్కారు హైద‌రాబాద్‌లోని బ‌యోలాజిక‌ల్-ఈ తో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
ఆర్‌బీడీ ప్రొటీన్ స‌బ్‌-యూనిట్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆ సంస్థ పెద్ద మొత్తంలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం కోసం కేంద్ర స‌ర్కారు ఈ ఒప్పందం చేసుకుంది. ఇప్ప‌టికే దేశీయ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు వేస్తుంది. 
 
బ‌యోలాజిక‌ల్ -ఈ అభివృద్ధి చేస్తోన్న‌ ఆర్‌బీడీ ప్రొటీన్ స‌బ్‌-యూనిట్ వ్యాక్సిన్ వినియోగంలోకి రానున్న రెండో భార‌తీయ టీకాగా నిల‌వ‌నుంది. ఒప్పందంలో భాగంగా 30 కోట్ల డోసుల ఉత్ప‌త్తికి కేంద్ర స‌ర్కారు ముంద‌స్తు చెల్లింపులు చేసింది. 
 
ఇందుకుగానూ మొత్తం రూ.1500 కోట్లు ముంద‌స్తుగా చెల్లించింది. ఇప్ప‌టికే 1, 2 ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నివేదికను కేంద్ర ప్ర‌భుత్వానికి బ‌యోలాజిక‌ల్-ఈ  సంస్థ అంద‌జేసింది. ప్ర‌స్తుతం మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రు‌పుతోంది. కొన్ని రోజుల్లో ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments