Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ జనాభా 133.89 కోట్లు.. ఆంధ్రాలో కర్నూలు టాప్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (08:36 IST)
దేశ జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. గత 2019లో దేశంలో జనన, మరణాలకు సంబంధించిన తాజా జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 133.89 కోట్లు. దేశంలో 2019లో 2.67 కోట్ల జననాలు నమోదు కాగా, 83 లక్షల మంది చనిపోయారు. నిమిషానికి సగటున 51 మంది శిశువులు జన్మిస్తుంటే, 16 మంది కన్నుమూస్తున్నారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లుగా, తెలంగాణ జనాభా 3.72 కోట్లుగా ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. లింగ నిష్పత్తిలో ఏపీ 16వ స్థానంలో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. అయితే, ఏపీలో జననాల్లో కర్నూలు ముందుండగా, మరణాల్లో తూర్పుగోదావరి జిల్లా ముందున్నాయి. 
 
2019లో ఏపీలో 7,54,939 మంది జన్మించారు. 4,01,472 మంది మరణించారు. మరణించిన వారితో పోలిస్తే జన్మించిన వారి సంఖ్య 88 శాతం అధికం. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం 2019 మధ్య నాటికి ఏపీ మొత్తం జనాభా 5,23,15,000.
 
ఇక, లింగ నిష్పత్తిలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. జనన సమయాల్లో ఏపీలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు 935 మంది బాలికలే జన్మిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ 16వ స్థానంలో నిలిచింది. అదేసమయంలో తెలంగాణలో ఈ నిష్పత్తి 953గా ఉంది. ఫలితంగా ఏడో స్థానంలో నిలిచింది. 
 
అరుణాచల్ ప్రదేశ్‌ ఈ విషయంలో అందరికంటే ముందుంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 1024 మంది బాలికలు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న నాగాలాండ్‌లో ఈ సంఖ్య 1001గా ఉంది. ఇక, ఆ తర్వాతి స్థానాల్లో మిజోరం (975), అండమాన్ (965), కేరళ, ఉత్తరాఖండ్‌ (960), తెలంగాణ (953) నిలిచాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments