Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొప్ప మనసు చాటుకున్న తమిళ జంట.. రూ.37లక్షల భారీ విరాళం

Advertiesment
TN couple
, శుక్రవారం, 18 జూన్ 2021 (22:30 IST)
Tamil Nadu Couple
తమిళనాడులోని ఓ కొత్త జంట గొప్ప మనసు చాటుకుంది. కరోనా సమయంలో తమ పెళ్లిని సింపుల్‌గా చేసుకుని మిగిలిన డబ్బును కొవిడ్ సహాయ నిధికి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అను, అరుల్ ప్రాణేశ్ అనే వధూవరులు మొదట తమ పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. 
 
పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తీసిపెట్టారు. ఈ నెల 14న వారి పెళ్లి జరిగింది. లాక్ డౌన్ కారణంగా వివాహానికి రూ.13 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి. ఇంకా రూ.37లక్షలు మిగిలింది. ఆ డబ్బుని వారు పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు.
 
కొవిడ్ భయం కారణంగా చాలామంది ఆహ్వానితులు రాలేదని, చివరికి ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా తామిచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశారని వరుడు అరుల్ ప్రాణేశ్ చెప్పాడు. ఈ పరిస్థితుల్లోనూ పెళ్లిని వాయిదా వేయకూడదని పెద్దలు నిర్ణయించారని, దీంతో తాము వట్టమాలై అంగలమ్మన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. స్థానిక అధికారుల అనుమతితో కొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినట్లు తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సబర్మతి నది నీటి నమూనాల్లో కరోనా జాడలు..