Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానయాన సంస్థలపై కేంద్రం సీరియస్!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (15:51 IST)
లాక్ డౌన్ సమయంలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో, ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులను ఇవ్వలేమని, దీనికి బదులుగా ప్రయాణ తేదీలను పోస్ట్ పోన్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని, ఎయిర్ లైన్స్ సంస్థలు స్పష్టం చేయడంపై కేంద్రం సీరియస్ అయింది.

అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణాలు చేయలేకపోయిన వారికి పూర్తి స్థాయిలో రిఫండ్ ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
ఎటువంటి క్యాన్సిలేషన్ చార్జీలు విధించకుండా పూర్తి మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని, గరిష్ఠంగా మూడు వారాల్లో డబ్బు వెనక్కు ఇవ్వాలని పౌర విమానయాన శాఖ ఓ సర్క్యులర్ లో ఎయిర్ లైన్స్ కంపెనీలను ఆదేశించింది.

అయితే, ప్రయాణికులు మే 3 వరకూ బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసిన కేంద్రం, రిఫండ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించింది.
 
కాగా, ఎయిర్ లైన్స్ సంస్థలు విస్తారా, గో ఎయిర్ తదితరాలు, తాము రిఫండ్ ను చేయలేమని ప్రకటించిన తరువాత, సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం స్పందించింది. ఇండియాలో రెండో దశ లాక్ డౌన్ మే 3 వరకూ అమలులో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments