Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

104, 1902 కాల్ సెంటర్లతో లాక్‌డౌన్ కష్టాలకు పరిష్కారం

104, 1902 కాల్ సెంటర్లతో లాక్‌డౌన్ కష్టాలకు పరిష్కారం
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:00 IST)
కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తోంది. ఒకవైపు కోవిడ్-19 వైరస్‌కు అడ్డుకట్ట వేస్తూనే, మరోవైపు లాక్‌డౌన్ వల్ల  ప్రజలకు ఎదురవుతున్న కష్టాలకు పరిష్కారాన్ని చూపుతోంది.

ఇందుకోసం ప్రజావసరాలను నిత్యం తీర్చాల్సిన 11 ముఖ్య ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ 104, 1902 కాల్ సెంటర్లను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందని కోవిడ్ -19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి తుమ్మా విజమ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కాల్ సెంటర్లు ఆరోగ్య, నిత్యావసర సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతోందని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో కలిగే ఆరోగ్యపరమైన సాధారణ సమస్యల పరిష్కారానికి 104 కాల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  నిత్యావసరాల లభ్యత, రవాణా, అత్యవసర సమస్యలకు1902 కాల్ సెంటర్ ఆన్ లైన్ పరిష్కారం చూపుతుందన్నారు.

లాక్‌డౌన్ సందర్భంగా ఆరోగ్య, అత్యవసర సమస్యల పరిష్కారానికి కమాండ్ కంట్రోల్ ఆధ్వర్యంలో 104, 1902 కాల్ సెంటర్ల నిర్వహిస్తుంది. 
 
1 క‌రోనా ఆరోగ్య సమస్యల నమోదు, పరిష్కారానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ – 104 సేవా కేంద్రం నిత్యావసర, అత్యవసర సమస్యల పరిష్కారానికి 1902 కాల్ సెంటర్. డా. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ఆధ్వర్యంలో 24x7 పనిచేసే 104 సేవా కేంద్రం దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా ఏర్పడే నిత్యావసర వస్తువుల రవాణా, రైతులకు కనీసం మద్ధతు దర లభ్యత, ధరల స్థిరీకరణ, నిత్యావసరాల లభ్యత విషయాలపై నిరంతర పర్యవేక్షణకు 24X7 పనిచేసే 1902 కాల్ సెంటర్ ఏర్పాటు

2. 60 టెలీఫోన్ లైన్లతో పనిచేస్తున్న 104 సేవా కేంద్రం 11 ప్రభుత్వ శాఖలతో 23 రకాల నిత్యావసర సేవలు అందజేత.

3. సాధారణ OPD సేవల స్థానంలో 104 ద్వారా ప్రారంభించిన టెలీ మెడిసిన్ సేవలు కాల్ సెంటర్ దృష్టికి వచ్చిన నిత్యావసర సేవల సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం

4. టెలీ మెడిసిన్ పద్ధతిలో సాధారణమైన అన్ని రోగాలకూ వైద్య సేవలు రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా, మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అమ్మినా, నిత్యావసర వస్తువు లభ్యత లేకున్నా, తూకంలో మోసాల పరిష్కారానికి తక్షణమే 1902 కాల్ సెంటర్ స్పందిస్తుంది. 

5.104 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసిన వారికి జిల్లాల వారీగా కోవిడ్ ఆసుపత్రుల వివరాలు అందజేయడం. లాక్ డౌన్ వల్ల ఆక్వా రైతుల ఉత్పత్తులను మార్కెట్ కు తెచ్చే క్రమంలో ఏర్పడే ఇబ్బందులకు తక్షణ పరిష్కారం.

6. 104 కు ఫోన్ చేసిన వారికి వ్యాధి లక్షణాలు తెలియపరచడం. పంటలను మార్కెట్ యార్డులకు తరలించే క్రమంలో తలెత్తే రవాణా సమస్యలకు పరిష్కారం. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తెలియజేయడం పోస్టాఫీసు, బ్యాంకులు ఏటీఎం తదితర  పౌర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా టోల్ ప్రీ నెంబరు 1902 కు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చు.

8. జిల్లాలోని రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల వివరాలు అందజేయడం. ఈ పాస్ ల జారీలో తలెత్తే సమస్యలకు పరిష్కారం

9. కరోనా వైరస్ నివారణకు పాటించాల్సిన నియమాలు తెలియజేయడం. పని ప్రదేశానికి వెళ్లడంలో రైతు కూలీలకు సమస్యలు ఎదురైతే పరిష్కారానికి సంప్రదించ వచ్చు.

10. విదేశాల నుంచి వచ్చిన వారి యొక్క ఇరుగు, పొరుగు నివాసాలలో ఉండే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం. కూరగాయలు, పండ్లు, డెయిరీ ఉత్పత్తులు, పౌల్ట్రీ ఫాం ఉత్పత్తులు తదితర వస్తువుల కొరత ఏర్పడినా, అధిక ధరలకు విక్రయించినా 1902 కు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందగలరు. 

11. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో సంప్రదించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియపరచడం.  రేషన్ షాపుల ద్వారా అందజేసే నిత్యావసర వస్తువుల పంపిణీలో సమస్యలు తలెత్తినా  ఫిర్యాదు చేయొచ్చు.

12. పశువులు, కోళ్ల దాణా లభ్యతలో ఇబ్బందులు తలెత్తినా ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.

13 పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర పెట్రోలియం ఉత్పత్తుల్లో సరఫరాలో సమస్యలు తలెత్తితే తెలియజేయవచ్చు.

14 మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడితే ఫోన్ చేసి పరిష్కారం పొందగలరు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కరోనా వ్యాధి లక్షణాల గురించి, పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రుల వివరాలు, తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర సమాచారం నిమిత్తం 104 కాల్ సెంటర్ కు  ఇప్పటి వరకూ 6,164 ఫోన్ కాల్స్ చేశారు.

వాటికి అవసరమైన సమాచారం ఇవ్వడం జరిగింది. నిత్యావసర, అత్యవసర సమస్యల పరిష్కారానికి 1902 కాల్ సెంటర్ కు ఇప్పటి వరకూ 5,990 ఫోన్ కాల్స్ రాగా, అందులో 4,797 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కట్టడికి ఆసుపత్రుల సన్నద్ధత ముఖ్యం: ఏపి సిఎస్