Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కట్టడికి ఆసుపత్రుల సన్నద్ధత ముఖ్యం: ఏపి సిఎస్

కరోనా కట్టడికి ఆసుపత్రుల సన్నద్ధత ముఖ్యం: ఏపి సిఎస్
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (08:55 IST)
రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇంటింటా సర్వే నిర్వహించి అనుమానిత లక్షణాలు గల వారి నుండి శాంపిల్స్ సేకరణ, పరీక్షలు నిర్వహణ,కంటైన్మెంట్, ఆసుపత్రులు సన్నద్ధత అత్యంత ప్రాధాన్యత అంశాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై మంగళవారం విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమీషనర్లు, డిఎంఆండ్ హెచ్ ఓలతో ఆమె వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు కోవిద్ ఆసుపత్రుల్లో టాప్ క్లాస్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అదే విధంగా జిల్లా కోవిద్ ఆసుపత్రుల్లో కూడా అదే విధమైన ఏర్పాట్లు చేయాలని, క్వారంటైన్ కేంద్రాలలో కూడా టాప్ క్లాస్ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. మరో రౌండ్ ఇంటింట సర్వే ప్రక్రియను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

కంటైన్మెంట్ ఏరియాలో ఏఒక్క పాజిటివ్ కేసు ఉండకూడదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ గడువు ముగిసే సమయం దగ్గర పెడుతోందని ఆతర్వాత ఏమి జరుగుతుందో తెలియదు కావున ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు మరింత జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉందని సిఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు.

ముఖ్యంగా  కంటైన్మెంట్ జోన్ లలో సర్వేను అత్యంత కట్టుదిట్టంగా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 121 కంటైన్మెంట్ జోన్లు అన్నిటిలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

ఇందుకు సంబంధించి ప్రతి జోన్ వారీగా మైక్రో స్థాయిలో ప్రణాళిక చేసుకుని శతృశేషం లేని రీతిలో ఏఒక్క పాజిటివ్ కేసు లేకుండా చూడాలని చెప్పారు.ఆసుపత్రుల ప్రిపేర్డ్ నెస్, కమ్యూనిటీ సర్వే లెన్స్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ‌

ఈ వీడియో సమావేశంలో గనులశాఖ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కె‌.భాస్కర్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం, ఆరోగ్య శ్రీ సిఇఒ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాపై పోరుకు టీటీడీ భారీ విరాళం