ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా?: కన్నా మండిపాటు

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:39 IST)
వైసీపీ ప్రభుత్వం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. కరోనా రోగుల కోసం ఆలయాల్లో క్వారంన్ టైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు.

జగన్ ప్రభుత్వానికి ఆలయాలు తప్ప మరెక్కడా చోటు దొరకలేదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీఎం జగన్​కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

మరెక్కడా చోటు లేదన్నట్టు ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు శోచనీయమని లేఖలో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కన్నా విమర్శించారు.

జిల్లా కలెక్టర్‌తో మాట్లాడేందుకు తమ పార్టీ నాయకులు ప్రయత్నించారని.. కలెక్టర్ వ్యవహరించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఈ ప్రతిపాదన మానుకుని క్వారంటైన్ కేంద్రాలు మరోచోట పెట్టాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి