Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?

Webdunia
గురువారం, 9 జులై 2020 (12:24 IST)
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయినిలో అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న వికాస్‌ను పోలీసులే అరెస్ట్ చేశారా? లేకుంటే పోలీసులకు లొంగిపోయాడా అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
కానీ వికాస్ దుబే ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వద్దకు వెళ్లి.. తానే వికాస్ దూబేనని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
 
పోలీసుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించి.. పోలీసులకు కాల్ చేసి చెప్పాడని తెలిపారు. అప్పటికే అనుమానం వచ్చిన ఆలయ సెక్యూరిటీ కూడా వికాస్‌ను ప్రశ్నించగా.. తప్పుడు ఐడీ కార్డు చూపించారని చెప్పారు. అనంతరం పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని వికాస్ దుబేను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 
 
ఐతే వికాస్ దుబే కావాలనే లొంగిపోయాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తన గ్యాంగ్‌లోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. వికాస్ దుబేలో ఏర్పడిన భయమే ఆయన పోలీసులకు చిక్కేందుకు కారణమైందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments