ఉజ్జయినిలో మహాకాల్ చూసేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన వికాస్ దుబె

గురువారం, 9 జులై 2020 (10:13 IST)
కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడైన వికాస్ దుబేను ఉజ్జయినిలో అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకల్‌ను చూడటానికి వచ్చిన దుబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు వికాస్ దుబే. కాగా వికాస్ దుబే యొక్క ఇద్దరు సహచరులు ఎన్కౌంటర్లో మరణించారు. మరో నిందితుడు ప్రభాత్ మిశ్రాను ఫరీదాబాద్ నుంచి బుధవారం అరెస్టు చేశారు. ఇదికాకుండా, వికాస్ దుబే ముఠాకు చెందిన మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాబన్ శుక్లా కూడా ఎటావాలో చంపబడ్డాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం MotoG 5G పేరుతో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్... ఫీచర్ల సంగతికి వస్తే..?