Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయీంకు ఆర్ కృష్ణయ్యకు లింకులు?

Advertiesment
నయీంకు ఆర్ కృష్ణయ్యకు లింకులు?
, గురువారం, 1 ఆగస్టు 2019 (13:51 IST)
నయీం కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని కోరుతూ వచ్చిన విన్నపానికి ఆర్టీఐ అధికారులు సమాధానమిచ్చారు. ఈ దరఖాస్తును ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సమర్పించింది. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించింది. 
 
ఆర్టీఐ సమర్పించిన వివరాల మేరకు, నయీం కేసులో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేరుతో పాటు పలువురు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లకు సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా, నయీం కేసులో అడిషనల్‌ ఎస్పీలు. శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, అమరేందర్‌రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. 
 
వీరితోపాటు నయీం కేసులో డీఎస్పీలు శ్రీనివాస్‌, సాయి మనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాష్‌రావు, వెంకటనర్సయ్యలకు సంబంధం ఉన్నట్టు తేలింది. అలాగే, నయీం కేసులో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేరు వచ్చింది. వీరితో పాటు ఇన్‌స్పెక్టర్లు మస్తాన్‌, శ్రీనివాసరావు, మాజీద్‌, వెంకట్‌రెడ్డి, వెంకటసూర్యప్రకాష్‌, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య.. బాలయ్య, రవీందర్‌, నరేందర్‌గౌడ్‌, దినేష్‌, సాదిఖ్‌మియాలు ఉన్నారు. 
 
వీరితో పాటు తెరాస నేతలైన భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాజర్‌, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేష్‌ పేర్లు. మాజీ సర్పంచ్‌ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ, వెల్దండ టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వరయ్య పేరు ఉన్నట్టు వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌కు ఉన్నది కూడా పోయినట్లుందే: వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు