'ఏక్ విలన్‌' నటుడితో డేటింగ్ చేయాలని ఉందంటున్న బాలీవుడ్ భామ

గురువారం, 1 ఆగస్టు 2019 (13:19 IST)
బాలీవుడ్ బామల్లో ఒకరైన కియారా అద్వానీ... అటు హిందీ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పటికే టాప్ హీరోలందరితో జోడీ కట్టిన ఈ భామ.. బాలీవుడ్‌లో ఓ కుర్ర హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో పేరు సిద్ధార్థ్ మల్హోత్రా. "ఏక్ విలన్" చిత్రంలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై కియారా అద్వానీ స్పందించింది. 'ఏక్ విలన్' నటుడుతో డేటింగ్ చేయాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించింది. 
 
బుధవారం తన 27వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న ఈ భామ... తన స్నేహితులకు ముంబైలో బర్త్‌డే పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి షాహిద్ కపూర్ కూడా హాజరయ్యాడు. పార్టీ ముగిసిన తర్వాత కైరా మాత్రం సిద్ధార్థ్‌తో కలిసి వెళ్లిపోయింది. వారిద్దరూ ఎక్కడుకు వెళ్లింది మాత్రం ఎవరికీ చెప్పలేదు. కానీ వెళ్లే ముందు మాత్రం ఫోటోలకు ఫోజులిచ్చి మరీ వెళ్లడం గమనార్హం. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సూప‌ర్ స్టార్ రజనీకాంత్ హిమాల‌యాలకు వెళుతున్నారా..?