Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో భీకర పేలుడు - కుప్పకూలిన భవనాలు.. ప్రాణనష్టం

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (14:56 IST)
బీహార్ రాష్ట్రంలో భీకర పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ పేలుడు రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో జరిగింది. 
 
గురువారం రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఏడుగురు మరణించగా, పలువురుకి గాయాలయ్యాయి. ఈ పేలుడు శబ్దాలు 4 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించాయి. కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతమంతా కంపించింది. అంటే ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు. 
 
తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కజ్‌బాలి చక్‌‍లో ఈ ఘటన జరిగింది. కాగా, ఈ పేలుడులో మృతి చెందినవారంతా ఎన్నోయేళ్లుగా బాణాసంచా తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన బాణాసంచాను ఇంటిలో నిల్వచేసి వుంటారని, ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments