కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

సెల్వి
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (13:23 IST)
దేశంలో పలు ప్రాంతాల్లో మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో కేక్ కొనేందుకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. 
 
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా కరడకిలో మహ్మద్ కుట్టి బేకరీ నడుపుతున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన 6 ఏళ్ల బాలిక తరచుగా కేకులు కొనడానికి బేకరీకి వస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడటం అలవాటు చేసుకున్న మహ్మద్ కుట్టి, కేక్ కొనడానికి వచ్చిన తర్వాత, చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు.
 
దీంతో ఆ బాలిక భయపడినప్పటికీ, ధైర్యం చేసుకుని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు మహమ్మద్ కుట్టి బేకరీని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలిక తల్లిదండ్రుల నుండి ఫిర్యాదును స్వీకరించి, దాని ఆధారంగా, పోక్సో చట్టం కింద మహమ్మద్ కుట్టిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం