భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ప్రశాంత్ నాయర్ ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న గృహ సమస్యలే ఈ సంఘటనకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రశాంత్ నాయర్ లెనోవాలో సీనియర్ సేల్స్- మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య పూజా నాయర్ గత 12 సంవత్సరాలుగా డెల్‌లో పనిచేస్తున్నారు. ఆ జంట బెంగళూరులోని చిక్కబనవారలో నివసించారు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.
వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ నాయర్, పూజా నాయర్ మధ్య తరచుగా జగడాలు జరిగేవి. వారు విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూజా నాయర్ తన భర్తను మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆదివారం నాడు ప్రశాంత్ నాయర్ తండ్రి పదే పదే ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాడు కానీ స్పందన రాలేదు. ఆందోళన చెందిన అతను ప్రశాంత్ నాయర్ ఫ్లాట్‌ని సందర్శించగా, అతను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది.
బెంగళూరులో మరో హై ప్రొఫైల్ ఆత్మహత్య సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ కేసు వచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ అనే టెక్ ప్రొఫెషనల్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.