Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

Advertiesment
rape

ఐవీఆర్

, గురువారం, 3 ఏప్రియల్ 2025 (13:52 IST)
బెంగళూరులో దారుణం జరిగింది. కేరళలో ఉద్యోగాన్ని వదిలేసి బెంగళూరులో మరో ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసారు. ఆమె రక్షించండి అంటూ కేకలు వేస్తున్నా ఎంతమాత్రం విడిచిపెట్టలేదు ఆ మృగాళ్లు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహారు రాష్ట్రానికి చెందిన యువతి కేరళలో ఓ ఉద్యోగం చేస్తోంది. అక్కడ ఆమె చేస్తున్న ఉద్యోగంలో ఇమడలేక మానేసింది. బెంగళూరులోని తన సోదరుడి వద్దకు వచ్చి నగరంలో ఏదయినా ఉద్యోగం చేద్దామని ఆలోచన చేసింది. ఈ క్రమంలో ఆమె బుధవారం రాత్రి కేఆర్ పురం రైల్వే స్టేషనులో అర్థరాత్రి ఒకటిన్నర గంటలకు రైలు దిగింది. వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి తనను పికప్ చేసుకోవాలని చెప్పింది. సోదరుడు రాగానే తనకు ఆకలిగా వుందనీ, ఏదయినా పెట్టించమని అడిగింది. దాంతో అతడు సమీపంలో వున్న టిఫిన్ సెంటరు వద్దకు వెళ్దామని చెప్పాడు. వారిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగు ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు.
 
తమను ఎందుకు అడ్డుకున్నారని అడిగేలోపుగానే యువతి సోదరుడిపై ఓ వ్యక్తి విరుచుకుపడ్డాడు. పిడిగుద్దులు కురిపించి పెడరెక్కలు విరిచిపట్టుకుని సమీపంలో వున్న చెట్టుకు కట్టేసాడు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం యువతిని ఈ ఇద్దరు కామాంధులు సమీపంలోని చెట్ల మధ్యకు తీసుకెళ్లి అత్యాచారం చేసారు. తనపై కామాంధులు విరుచుకుపడుతుండటంతో యువతి తనను రక్షించాలంటూ పెద్దగా కేకలు వేసింది. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఈలోపుగా ఒకడు పారిపోయాడు. మరొకడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పరారీలో వున్న వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్