Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

Advertiesment
wife beating husband

ఠాగూర్

, గురువారం, 3 ఏప్రియల్ 2025 (11:20 IST)
అతనో లోకో పైలెట్, నెలకు లక్ష రూపాయలకు పైగానే వేతనం వస్తుంది. పైసా కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు.. అయినప్పటికీ డబ్బులు, నగలు ఇవ్వాలంటూ భర్తపై భార్య కర్కశకంగా దాడి చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా అనే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
తనను కొట్టొద్దంటూ ప్రాధేయపడుతూ వేడుకుంటున్నా ఆ భార్య మాత్రం ఏమాత్రం వినలేదు కదా ముఖంపై కాలితో తన్నింది. అయితే, బాధితుడు హిడెన్ కెమెరా ద్వారా అతనిపై జరిగిన దాడిని రికార్డు చేసి ఆమె నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గత నెల 20వ తేదీన జరిగింది. బాధితుడు పేరు లోకేష్. అతని భార్య పేరు హర్షిత రైక్వార్. వీరిద్దరి మధ్య గంతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. 
 
అయితే, ఇటీవల తన తల్లి, సోదరుడుతో కలిసి భర్తపై హర్షిత భౌతికదాడికి దిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్తను పట్టుకుని చావబాదింది. భార్య కొడుతుంటే తనను కొట్టొద్దంటూ భర్త ప్రాధేయపడుతున్నాడు. దండం పెట్టాడు. కాళ్లు మొక్కినా వినలేదు. ఈ దాడిని ఆమె తల్లి అడ్డుకునేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. భర్త లోకేష్‌ను భార్య ముఖంపై కాలితో తన్నింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తనకు రక్షణ కల్పించాలని లోకేష్ పోలీసులను ఆశ్రయించాడు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!