Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

Advertiesment
crocodile

ఠాగూర్

, మంగళవారం, 25 మార్చి 2025 (16:26 IST)
సామాజిక మాధ్యమాల్లో అనేక వైరల్ వీడియోలు షేరింగ్ అవుతుంటాయి. వీటిలో అపుడపుడూ క్రూర మృగాలకు సంబంధించిన వీడియోలు బాగా పాపులర్ అవుతుంటాయి. ఈ తరహాలోనే తాజాగా ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఓ భారీ మొసలి ఒకటి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన విద్యార్థులు, స్థానికులు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు, జంతు ప్రేమికులు ఘటనా స్థలానికి చేరుకుని తగిన సహాయక చర్యలు చేపట్టారు. మొసలికి ఎవరూ ఎలాంటి హాని కలిగించకుండా, గాయపరచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, కొంత సమయం తర్వాత ఆ మొసలి స్వయంగా స్థానిక పొవై సరస్సులోకి వెళ్లిపోయింది. దీంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు