Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Advertiesment
sweety bura

ఠాగూర్

, మంగళవారం, 25 మార్చి 2025 (10:08 IST)
భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ నివాస్ హుడాపై ఆయన భార్య, ప్రముఖ దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా భౌతికదాడికి తెగబడింది. నిజానికి ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. తన భర్త దీపక్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీ బూరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీ బూరా దీపక్ గల్లా పట్టుకుని దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి...
 
హైదరాబాద్ నగరంలోని ఓ షాపు ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన బాలీవుడ్ నటి... వ్యభిచారం చేయాలంటూ ఇద్దరు మహిళలు ఒత్తిడి తెచ్చారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నటిని రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన టీవీ, సినీ నటిని ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఓ షాపు ఓపెనింగ్‌కు ఆమె స్నేహితురాలు ఆహ్వానించింది. దీంతో ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకుంది. మాసబ్ ట్యాంకు, శ్యామ్ నగర్ కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో ఆమెకు బస ఏర్పాటుచేశారు. అక్కడామెకు ఓ వృద్ధురాలు అవసరమైన వసతులు ఏర్పాటుచేసింది. ఇంతవరకు బాగానే వుంది. 
 
అయితే, 21వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు మహిళలు అపార్టుమెంటులోకి ప్రవేశించి తమతో కలిసి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని బలవంతం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే వారంతా అక్కడ నుంచి జారుకున్నారు. 
 
ఆ వెంటనే ఇద్దరు మహిళలు, వృద్ధురాలు నటిని గదిలో బంధించి రూ.50 వేల నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధిత నటి వెంటనే 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని విడిపించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముగ్గురు మహిళలతో పాటు ఆ ఇద్దరు పురుషుల కోసం గాలిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం