ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఎంతలా అభివృద్ధి చెందుతుందో మనిషి ఊహలకు కూడా అందడం లేదు. కొన్ని విషయాల్లో ఏఐ మానవలోకానికే సవాల్ విసురుతోంది. మనిషికి సాధ్యంకాని పనులను కూడా ఇట్టే చకచకా చేసేస్తుంది. వైద్య రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తుంది. ప్రాణంపోసే వైద్యులే చేతులెత్తేసిన కేసుల్లో రోగులకు ఏఐ అండగా నిలుస్తుంది. తాజాగా ఓ రోగి ప్రాణాలను ఏఐ కాపాడింది. చావు అంచుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతడిగి ప్రాణం వచ్చేలా చేసింది.
ఇంతకీ ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం.. అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చెందిన జోషఫ్ కొవాటెస్ అనే 37 యేళ్ల వ్యక్తి పోయెమ్స్ సిండ్రోమ్ అనే రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి అతడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కాళ్లు, చేతులు మొద్దుబారిపోయాయి. గుండె లావుగా అయింది. కిడ్నీలు పాడైపోయాయి. ఇక రెండు మూడు రోజులకు ఒకసారి అతని శరీరం నుంచి వ్యర్థ ద్రవాలను వెలికి తీస్తున్నారు. పైగా, అతడి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించసాగింది. దీంతో అతని త్వరలోనే చనిపోతాడని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. జోసెఫ్ కూడా తన ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. కానీ, అకడి ప్రియురాలి ఆశ మాత్రం చావలేదు. ప్రియుడుని ఎలాగైనా బతికించుకోవాలని భావించి, సమస్యకు పరిష్కారాన్ని వెతకడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఒక యేడాది క్రితం ఆమె ఓ రేర్ డిసీజ్ పేరుతో జరిగిన ఓ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అక్కడ ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ డేవిడ్‌ను కలుసుకుంది. ఆయనకు తన ప్రియుడు పరిస్థితిని వివరిస్తూ ఓ లేఖ రాసింది. దానికి ఆయన స్పందించారు. ఏం చేస్తే జోసెఫ్ ఆరోగ్యం బాగు పడుతుందో వివరించారు. అతడు చెప్పినట్టు ఆమె చేసింది. జోసెఫ్ క్రమంగా కోలుకోవడం మొదలు పెట్టారు.
నాలుగు నెలల తర్వాత జోసెఫ్‌కు వైద్యులు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఇపుడు జోసెఫ్ పూర్తిగా కోలుకున్నాడు. ఇందులో ఏఐ పాత్ర కీలకం. ఇక్కడ ఏఐ చెప్పిన పనిని డాక్టర్ డేవిడ్ చేశారు. ఏఐ నుంచి సజెషన్స్ తీసుకుని ఏం చేయాలో జోసెఫ్ ప్రియురాలికి చెప్పాడు. ఏఐని ఉపయోగించి చికిత్సలు అందించే వైద్యుల టీమ్‌లో డేవిడ్ కూడా ఓ సభ్యుడు మారిపోయాడు.