Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

Advertiesment
Pills

ఠాగూర్

, గురువారం, 3 ఏప్రియల్ 2025 (10:19 IST)
అగ్రరాజ్యం అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భంరాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను కనుగొన్నారు. ఇది స్పెర్మ్ (వీర్యం) ఉత్పత్తిపై ప్రభావం చూపి గర్భ నిరోధకతగా పని చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. వైసీటీ 529 అనే ఈ పిల్‌ను కొలంబియా యూనవర్శిటీ, యానివర్శిటీ ఆఫ్ మిన్నెసొటా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, యూవర్ ఛాయిస్ థెరప్యూటిక్స్‌కు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 
 
ఇప్పటికే పురుషులకు మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్టు పరిశోధకులు వెల్లడించారు. సేఫ్టీ, ప్రభావవంత పనితీరుకు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలో జరుపనున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. కాగా, పురుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించక ముందు మగ ఎలుకలపై వైసీటీ 529 డ్రగ్‌ను ప్రయోగించారు. 
 
నాలుగు వారాల వ్యవధిలోనే వాటి స్పెర్మ్ కౌంట్ భారీగా తగ్గింది. అలాగే, 99 శాతం ప్రభావవంతంగా పని చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. అంతేకాక, ఈ పిల్ వాడకాన్ని అపేసిన ఆరు వారాల్లోగా ఎలుకలు మళ్లీ ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పొందినట్టు తెలిపారు. వైసీటీ 529 ఆమోదం లభిస్తో కొంతమేర అవాంఛనీయ గర్భధారణను అరికట్టే అవకాశం ఉంది. అలాగే దీనివల్ల మహిళలపై కూడా భారం తగ్గే ఆస్కారం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?