Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

Advertiesment
CEO Amit Mishra

ఐవీఆర్

, గురువారం, 3 ఏప్రియల్ 2025 (15:34 IST)
పని-జీవితం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగాలి. వీటిలో ఏది ఎక్కువ చేసినా రెండోదానికి దెబ్బ పడుతుంది. ఇదే విషయాన్ని బెంగళూరులో ఓ కంపెనీకి చెందిన CEO లింక్డ్ ఇన్ పేజీలో రాసారు. తను పని చేస్తున్న సమయంలో అకస్మత్తుగా ముక్కు నుంచి రక్తం పడిందని చెప్పారు. డేజిఇన్ఫో మీడియా అండ్ రీసెర్చ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ మిశ్రా. తను అనారోగ్యం బారిన పడిన విషయాన్ని లింక్డ్ ఇన్ పేజీలో పోస్ట్ చేసారు. ఐసీయూలో బెడ్ మీద పడుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఫోటోలో కనబడుతున్నారు. ఆ ఫోటోను పేజీలో పెట్టి ఇలా రాసుకొచ్చారు.
 
మీరు చేస్తున్న పని అనేది చాలా ముఖ్యమే. ఐతే అంతకంటే ఆరోగ్యం కూడా. దాని ప్రాధాన్యత ఎంతో కూడా చెప్పలేము. ఎందుకంటే ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వకపోతే సైలెంట్ కిల్లర్స్ ఆరోగ్యాన్ని కుంగదీస్తాయి. నేను ఓ ప్రాజెక్ట్ విషయమై పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నా ముక్కు నుండి రక్తం పడింది. అంతేకాదు... నా రక్తపోటు ఏకంగా 230కి చేరింది. నన్ను పరీక్షించిన వైద్యులు బీపీ తగ్గేందుకు మందులు వాడారు. ఐతే బీపీ సడెన్ డ్రాప్ కావడంతో నేను మూర్ఛిల్లాను. దాంతో ఒక్కసారిగా నా శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయో చెక్ చేసేందుకు వైద్యులు పలు పరీక్షలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ నేను చెప్పేదేమిటంటే... పని మాత్రమే నాకు ప్రధానం అనుకోవద్దు. ఆరోగ్యం కూడా అనుకోవాలి, దాన్ని అశ్రద్ధ చేస్తే శరీరం మన మాట వినదు. దానికి తోచినట్లు అది ప్రవర్తిస్తుంది. అందుకు ఉదాహరణే నేను.
 
మీ శరీరం ప్రతిసారి మీ అనారోగ్యం గురించి హెచ్చరికలు చేస్తూ వుండదు. అధిక రక్తపోటు, ఒత్తిడి తదితరాలు సైలెంట్ కిల్లర్స్. ఇవి ఎప్పుడు ఎలా మనిషిని చంపేస్తాయో కూడా తెలియదు. మనం చాలా సమస్యలను పెద్దగా పట్టించుకోము. తలనొప్పి వచ్చినా, చేతులు కాళ్లూ తిమ్మిర్లు పడుతున్నా, ఛాతీలో తట్టుకోలేనంత నొప్పిగా వున్నా, భుజం ఒకవైపు పీకుతున్నట్లు నొప్పి పెడుతున్నా, విపరీతమైన కడుపు నొప్పిగా వున్నా... ఇలా ఎలాంటి సమస్యను అంత సీరియస్ గా తీసుకోము. అయితే అవే మన పాలిట అపాయకర సమస్యలను తీసుకుని వస్తాయి. కనుక ఏ అనారోగ్య సమస్యనైనా అంత తేలిగ్గా తీసవేయవద్దు. పని చేయడం ముఖ్యమే, కానీ దానితో పాటు ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వాలి అంటూ ఆయన పెట్టిన పోస్టుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు