Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య తీర్పు నేపథ్యంలో భారత్‌లో ఉగ్ర దాడులకు ప్లాన్

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (15:34 IST)
దశాబ్దాల తరబడి వివాదంగా ఉన్న అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉంది. వివాదాస్పద అయోధ్య స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
 
ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిజానికి అయోధ్య తీర్పు వెల్లడి కావడానికి ముందు నుంచే ఉగ్ర సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు వేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వానికి భారత మిలటరీ ఇంటెలిజెన్స్‌, రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి సంస్థలు తెలిపాయి.
 
దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల ప్రతిపాదిత లక్ష్యాలను ముందుగానే పసిగట్టి ఈ దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు జరపవచ్చని నిఘా సంస్థలు చెప్పాయి. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య తీర్పును పాకిస్థాన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ తీర్పుతో భారత్‌లో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందనే విషయం తేటతెల్లమైందని ఆరోపించింది. దీనికితోడు ఉగ్రమూకలు సైతం దేశంలో దాడులకు తెగబడేందుకు సిద్ధమయ్యారని నిఘా వర్గాలు హెచ్చరిక చేశాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments