Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యంత సుదీర్ఘంగా సాగిన అయోధ్య కేసు

అత్యంత సుదీర్ఘంగా సాగిన అయోధ్య కేసు
, ఆదివారం, 10 నవంబరు 2019 (10:31 IST)
సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా అయోధ్య కేసు చరిత్రపుటలకెక్కింది. ఆగస్టు ఆరో తేదీన ఈ కేసు విచారణను ప్రారంభించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16వ తేదీ వరకు కొనసాగించింది. ఈ విచారణలో చివరి 40 రోజులు అత్యంత కీలంగా మారాయి. రామజన్మభూమిపై 1857లో న్యాయస్థానంలో తొలిసారి వ్యాజ్యం దాఖలు కాగా, 162 ఏళ్ల తర్వాత ఈ నెల 9వ తేదీ శనివారం తుది తీర్పు వెల్లడైంది. దీంతో వివాదాస్పద అయోధ్య కేసు ముగిసినట్టయింది. 
 
వాస్తవానికి ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకునేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచులతో కూడిన ముగ్గురు మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు నియమించింది. ఈ కమిటీ ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చలేక పోయింది. దీంతో అయోధ్య కేసులో పరిష్కారం కోసం అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రంగంలోకి దిగింది. 
 
అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. రామజన్మభూమికి సంబంధించి అఖిల భారత హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్‌‌సింగ్‌ చూపించిన మ్యాప్‌ను కోర్టు హాల్‌లోనే ధవన్ చించివేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం వాకౌట్ చేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య తీర్పు.. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం