Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి గంటే వుంటారట

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి తీసుకున్న ఓ నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం వేడుక గురువారం సాయంత్రం విజ్ఞాన్‌ భవన్‌లో జరగనుంది.

Webdunia
గురువారం, 3 మే 2018 (14:30 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి తీసుకున్న ఓ నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం వేడుక గురువారం సాయంత్రం విజ్ఞాన్‌ భవన్‌లో జరగనుంది. 
 
రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలందరూ అవార్డులను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి కోవింద్‌ గంట మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కొందరు విజేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించటం దుమారం రేపింది.  
 
కాగా ఈ ఏడాది మొత్తం 140 మంది చలన చిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతులమీదుగా అందజేయాల్సి వుంటుంది. కానీ రాష్ట్రపతి గంట మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని.. 11 అవార్డులను మాత్రమే అందజేస్తారని.. మిగిలిన అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందిస్తారని రాష్ట్రపతి కార్యాలయం నిర్వాహకులకు తెలిపింది. దీనిపై విజేతలు చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
గతే ఏడాది జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ ముఖర్జీ(82) ఎంతో ఓపికగా విజేతలకు అవార్డులను అందజేయగా.. కోవింద్ మాత్రం గంట సేపే ఈ కార్యక్రమంలో వుండటం చాలామందికి నచ్చలేదని జాతీయ మీడియా కోడైకూస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments