Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉమెన్స్ వర్క్ ఫోర్స్ తగ్గిపోతోంది? : శాంతా షీలా నాయర్

అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా రాణించాలని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతా షీలా నాయర్ పిలుపునిచ్చారు. ఒక మాజీ బ్యూరోక్రాట్‌గా ఉమెన్స్ డే వేడుకలను నిర్వహించుకోవడం తనకు ఏమాత్

ఉమెన్స్ వర్క్ ఫోర్స్ తగ్గిపోతోంది? : శాంతా షీలా నాయర్
, గురువారం, 8 మార్చి 2018 (18:53 IST)
అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా రాణించాలని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతా షీలా నాయర్ పిలుపునిచ్చారు. ఒక మాజీ బ్యూరోక్రాట్‌గా ఉమెన్స్ డే వేడుకలను నిర్వహించుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. ఎందుకంటే.. వేళ్లమీద లెక్కించదగిన స్థాయిలోనే మహిళలు రాణిస్తున్నారని, ఇదిపూర్తిగా మారిపోవాలన్నారు. ఎందుకంటే.. దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగాలైన టెలికాం, విద్యుత్, కోల్, బ్యాంకింగ్ రంగాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆమె చెప్పారు.
 
ఈ రంగాల్లో 60 నుంచి 70 శాతం మంది పురుషులే పని చేస్తున్నారన్నారు. పరిస్థితి ఇలావుంటే మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారని చెప్పడం భావ్యం కాదన్నారు. అలాగే, ఆడశిశు జననాల రేటు కూడా గణనీయంగా తగ్గిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా, గిరిజన తెగల ప్రజలు నివశించే నీలగిరి జిల్లాలో ఈ ఆడశిశు జననాల రేటు బాగా ఉందనీ, కానీ, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు గణనీయంగా తగ్గిపోతుందని ఆమె గుర్తుచేశారు. 
 
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కొచ్చిన్‌కు చెందిన ఈస్ట్రన్ గ్రూపు అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచిన పలువురుకి 2018 చెన్నై ఈస్ట్రన్ భూమిక అవార్డుల పేరుతో  సత్కరించారు. 
 
ఈ అవార్డులను అందుకున్న వారిలో ప్రీతి శ్రీనివాసన్ (కో-ఫౌండర్ - సల్ఫ్రీ), ఉమా ముత్తురామన్ (ఫౌండర్ -సుయామ్), శరణ్య (విద్యార్థిని), అనిత (నర్సు), పద్మావతి నరసింహామూర్తి (ఫౌండర్ - ఏడబ్ల్యూపీటీ), డాక్టర్ సుప్రజ ధరణి (ఫౌండర్ - ట్రుస్టీస్), నేహా షాహిన్ (లీడర్ ట్రాన్స్ రైట్), ప్రవీణా సాల్మాన్, రాజలక్ష్మి రవి (ఫౌండర్ టాంకర్ ఫౌండేషన్) తదితరులు ఉన్నారు. 
 
కాగా, ఈ తరహా అవార్డులను దేశ వ్యాప్తంగా చెన్నై, కొచ్చిన, బెంగుళూరు, హైదరాబాద్, లక్నో, అగ్రా, వారణాసితో పాటు ఏడు నగరాల్లో మొత్తం 70 మంది మహిళలకు అందజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మష్రూమ్స్ తింటే.. గుండెకు మేలు.. ఎలా?