Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భవతులు కోడిగుడ్లు తినొచ్చా..?

కోడిగుడ్డు సంపూర్ణ పోషకాహారమని తెలిసిందే. గుడ్డును ప్రతిరోజు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే గర్భవతి ప్రతిరోజు కోడిగుడ్లను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు తెలివితేటలు రెట్టింపు అవ

గర్భవతులు కోడిగుడ్లు తినొచ్చా..?
, శుక్రవారం, 26 జనవరి 2018 (16:27 IST)
కోడిగుడ్డు సంపూర్ణ పోషకాహారమని తెలిసిందే. గుడ్డును ప్రతిరోజు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే గర్భవతి ప్రతిరోజు కోడిగుడ్లను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు తెలివితేటలు రెట్టింపు అవుతాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. కోడిగుడ్డు సొనలోని కోలెన్ గర్భస్థ శిశువు తెలివితేటలను పెంచడానికి దోహదపడుతుందని పరిశోధనలో తేలింది.
 
కోడిగుడ్డు ద్వారా 115 మిల్లీగ్రాముల పోలెన్ లభిస్తుందని.. గర్భవతి రోజుకు మూడు లేదా నాలుగు గుడ్లు తీసుకుంటే మంచిదని, వీటి ద్వారా రోజూ 450మిల్లీగ్రాముల కోలెన్ లభిస్తుందని పరిశోధకులు తెలిపారు. 9వ నెలలో 950మిల్లీ గ్రాముల కోలెన్ తీసుకోవాలంటే సుమారు 9గుడ్లు తినాలట. అయితే గర్భవతి ఇన్ని గుడ్లు తీసుకుంటే అందులో కొలెస్ట్రాల్ ఉప్పు కూడా ఉంటుందని కూడా చెపుతున్నారు.
 
సుమారు 26మంది గర్భవతులపై ఇలాగే కోడిగ్రుడ్లతో పరిశోధనలు చేశారట. మరికొందరికి అసలు ఇవ్వలేదు. వీరు ప్రసవం అయిన తరువాత పిల్లలను చూస్తే వారిలో విషయ గ్రహణ శక్తి ఎక్కువగా పెరిగిందని గమనించారు. గుడ్డు తినని బిడ్డలకు ఐ క్యూ సాధారణంగా ఉండడాన్ని గమనించారు. అయితే గర్భవతులు వైద్యుల పర్యవేక్షణలోనే గుడ్లు తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగజాతి అంతమైపోతుందా? ఎందుకంటే...