Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాచేపల్లి ఘటన.. బాలికకు చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం.. ఉద్రిక్తత

కామాంధులు వయోభేదం లేకుండా విరుచుకుపడుతున్నారు. కథువా, ఉన్నావో లాంటి ఘటనలతో 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షవిధించేలా ఆర్డినెన్స్‌లు వచ్చినా.. తొమ్మిదేళ్ల బ

Webdunia
గురువారం, 3 మే 2018 (14:01 IST)
కామాంధులు వయోభేదం లేకుండా విరుచుకుపడుతున్నారు. కథువా, ఉన్నావో లాంటి ఘటనలతో 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షవిధించేలా ఆర్డినెన్స్‌లు వచ్చినా.. తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఈ ఘటన ఏపీలోని దాచేపల్లిలో చోటుచేసుకుంది. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లిన కామాంధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా వుంది. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
 
నిందితుడి అరెస్ట్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే బాలికపై ఈ అఘాయిత్యం చోటుచేసుకోవడంపై స్థానికులు, మహిళా సంఘాలు మండిపడుతున్నారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. 
 
బాలికపై అఘాయిత్యం నేపథ్యంలో దాచేపల్లిలో చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. వ్యాపారస్తులు తమ దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. చాక్లెట్లు తీసిస్తానని 55 ఏళ్ల నిందితుడు బాలికపై లైంగిక దాడి చేశాడని.. ఆపై బాలికను ఇంటి దగ్గర దింపి వెళ్లాడని స్థానికులు చెప్తున్నారు. కానీ బాలిక కడుపు నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆపై ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. 
 
బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. దీంతో నిందితుడైన సుబ్బయ్య పారిపోయాడు. చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన సుబ్బయ్యను వెంటనే అరెస్ట్‌ చేసి... కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం