Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ షాక్‌తో చనిపోతే అమరవీరులని అంటామా..? శిఖా శర్మ అరెస్ట్

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (22:59 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్లిన 22 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఉన్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నక్సల్స్‌తో జరిగిన కాల్పుల్లో అమరులైన భద్రతా బలగాల సిబ్బంది గురించి అస్సోం రచయిత్రి శిఖా శర్మ తన ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
 
అమరులైన 22 మంది జవాన్ల గురించి ఎఫ్‌బీలో పోస్ట్ పెట్టిన ఆమె.. జీతాలు తీసుకుంటూ డ్యూటీలో భాగంగా చనిపోయిన వారిని అమరవీరులని పిలవొద్దని, 'విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది కరెంట్ షాక్‌తో చనిపోతే వారిని అమరవీరులని అంటామా' అని లాజిక్ చెబుతూ మరీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. మీడియా ప్రజలను భావోద్వేగానికి గురిచేయొద్దని ఆమె సూచించారు. 
 
శిఖా శర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలైంది. నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం ఆమె దిగజారుడు ఆలోచనలకు నిదర్శనమని నెటిజన్లు మండిపడ్డారు. 
 
అమరులైన జవాన్ల గురించి అనుచిత పోస్ట్ పెట్టిన ఆమెపై దిస్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశద్రోహం కేసుతో పాటు పలు కేసులను ఆమెపై నమోదు చేసినట్లు గువహటి సిటీ పోలీస్ కమిషనర్ మున్నా ప్రసాద్ గుప్తా తెలిపారు. ఆమెను కోర్టును ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments