Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో బిజీబిజీగా రజనీకాంత్.. నేడు అఖిలేష్‌తో భేటీ...

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (15:30 IST)
ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఆదివారం మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేసిన రజనీకాంత్.. అఖిలేశ్ యాదవ్‌ను ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్ వెంట ఆయన భార్య లత కూడా ఉన్నారు. అఖిలేశ్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ దివంగత అధినేత ములాయం సింగ్ యాదవ్ చిత్ర పటం వద్ద రజనీకాంత్ నివాళులు అర్పించారు.
 
'ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తొమ్మిదేళ్ల క్రితం అఖిలేశ్ యాదవ్‌‌ను కలుసుకున్నాను. అప్పటి నుంచి మేము స్నేహితులం. ఫోన్‌‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఐదేళ్ల క్రితం నేను ఇక్కడకు షూటింగ్ కోసం వచ్చినప్పటికీ, కలుసుకోలేకపోయాను. అందుకని ఇప్పుడు కలిశాను' అని రజనీ మీడియా ప్రతినిధులతో అన్నారు. 
 
అఖిలేశ్‌తో సమావేశం ఎలా జరిగిందని ప్రశ్నించగా.. గొప్పగా జరిగిందని బదులిచ్చారు. ఇది మార్యాదపూర్వక భేటీయేనని, అఖిలేశ్ తన మిత్రుడని రజనీ పేర్కొన్నారు. తాను ఆదివారం లక్నో నుంచి అయోధ్య రాముడి దర్శనం కోసం వెళుతున్నట్టు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా కలుస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. నవ్వుతూ నో అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments