Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో పెరిగిన కోటీశ్వరుల సంఖ్య

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (15:10 IST)
గత 2019 సంవత్సరం ఆఖరులో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించింది. అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. దీంతో అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అయితే, ఈ మహమ్మారి తర్వాత మన దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. ధనవంతులు, మరింత సంపద పరులుగా మారారు. 
 
ఒకవైపు కరోనా కారణంగా ఎన్నో ఆర్థిక సవాళ్లు ఎదురు కావడమే కాకుండా ఉపాధి కోల్పోయే పరిస్థితులను చూశాం. కానీ, అదే సమయంలో కొందరికి మెరుగైన సంపాదన అవకాశాలు ఏర్పడినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆదాయపన్ను రిటర్నులు ఆధారంగా చూస్తే రూ.కోటికిపైన ఆదాయం ఉన్న విభాగంలోకి గడిచిన మూడేళ్లలో కొత్తగా 57,951 మంది వచ్చి చేరారు.
 
కరోనా మహమ్మారి ప్రవేశానికి ముందు ఆర్థిక సంవత్సరం 2019-20 నాటికి రూ.కోటికి పైగా ఆదాయం సంపాదించే వారు 1,11,939 మంది ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి కోటీశ్వరుల సంఖ్య 1,69,890 మందికి చేరింది. అంటే మూడేళ్లలో 50 శాతం పెరిగారు. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. 
 
కరోనా వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం 2020-21లో మాత్రం కోటికి పైన ఆదాయం ఉన్న వారి సంఖ్య 81,653కు తగ్గగా, ఇక ఆ తర్వాత నుంచి ముందుకే దూసుకుపోతోంది. కరోనా వల్ల 2020-21లో ఎక్కువ రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడం గుర్తుండే ఉంటుంది. దీనివల్లే ఆ సంవత్సరానికి కోటీశ్వరులు తగ్గారు.
 
మరి ఇంత పెద్ద ఎత్తున కోటీశ్వరులు పెరగడానికి కారణాలను పరిశీలిస్తే.. స్టాక్ మార్కెట్‌లో బూమ్ రావడం, స్టార్టప్ లు జోరుగా పెరగడం, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాల్లో మంచి వృద్ధి రావడం, ఒక్కరే ఒకటికి మించిన సంస్థలో పని చేయడాన్ని పన్ను అధికారులు ప్రస్తావిస్తున్నారు. 2016-17 నాటికి దేశంలో కోటీశ్వరుల సంఖ్య 68,263గానే ఉంది. ఆరేళ్లలో మూడింతలు పెరగడం మారిన దేశ ఆర్థిక పరిస్థితులకు నిదర్శనంగా చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments