Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముసలోడే జైలర్ గా ఫిట్ అయ్యాడు : రివ్యూ రిపోర్ట్

Jailer poster
, గురువారం, 10 ఆగస్టు 2023 (13:29 IST)
Jailer poster
నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు మరియు తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ఎ, డిటర్: ఆర్.నిర్మల్, దర్శకుడు : నెల్సన్ దిలీప్ కుమార్, నిర్మాత: కాలనీతి మారన్, విడుదల తేదీ : ఆగస్టు 10, 2023. 
 
webdunia
mohanlal-rajni
రజనీకాంత్‌ సినిమాలంటే చెల్లెలి సెంటిమెంట్‌, కూతురు సెంటిమెంట్‌ కథలు ఇంతకుముందు వచ్చాయి. పెద్దగా సక్సెస్‌ లేకపోయినా పర్వాలేదు అనేలాఆడాయి. ఈసారి అలాకాకుండా రెండేళ్ల విరామం తర్వాత రజనీకాంత్ వెండితెరపైకి వచ్చిన చిత్రం జైలర్. కోలమావు కోకిల, డాక్టర్ మరియు బీస్ట్ వంటి హెల్మింగ్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో రజనీకాంత్ తీసిన యాక్షన్  జైలర్‌ ఎలా వుందో చూద్దాం.
 
webdunia
Jackie Shroff
కథ:
పోలీసు అధికారి జైలర్‌గా విధినిర్వహలు చేశాక రిటైర్‌ అయి ఇంట్లో మనవడితో ఆడుకుంటూ గడిపే ముత్తు చాలా సరదగా వుంటాడు. నిజాయితీకి మారుపేరులా కొడుకు వుండాలని అతన్ని ఎ.సి.పి.ని చేస్తాడు. పురాతన ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించిన ఓ బ్యాచ్‌ను పట్టుకుని నానాటార్చర్‌ పెడతాడు. కానీ తనతండ్రిలా నిజాయితీ వుండాలన్నదే తన కోరిక అన్న ఎ.సి.పి.ని  ఆ తర్వాత కష్టాలు తెచ్చుకుంటాడు. షడెన్‌గా ఎసిపి. కనిపించకుండాపోయాడని డిపార్ట్‌మెంట్‌ ఎంక్వయిరీ చేస్తుంది. చనిపోయాడని విగ్రహాలదొంగల నాయకుడు చెప్పేసరికి జీర్ణించుకోలేని ముత్తు ఉన్నతాధికారులను కలుస్తాడు. ఫలితం వుండదు. దాంతో తన రూటులో వెళ్ళి తన కుటుంబాన్ని, తన కొడుకును ఏవిధంగా కాపాడుకున్నాడు? దుండగులను ఎలా శిక్షించాడు? అసలు ముత్తుకు పెద్ద ఎత్తున సాయం ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
రజనీకాంత్‌ వయస్సుకు తగ్గ పాత్ర పోషించాడు. కథ కూడా అలాగే వుంది. ఏయ్‌ ముసలోడా! అంటూ యోగిబాబు చేత మరికొంతమందిచేత సన్నివేశపరంగా రజనీకాంత్‌ పిలిపించుకోవడం ఇందులో ప్రత్యేకం. ముసలోడైలా ఫిట్‌గా వుండాడని విగ్రహ దొంగల నాయకుడు కితాబుకూడా ఇస్తాడు. ఇలా అందరినీ మెప్పించేలా రజనీ పాత్రను సహజంగా దర్శకుడు డిజైన్‌ చేశాడు. 
 
నీతి నిజాయితీలకు మారు పేరైన జైలర్‌ అంతే ఇదిగా కొడుకు వుండాలనుకుంటే అతను ఏంచేశాడు? అనేది సినిమాలోని ఆసక్తికర పాయింట్‌. ఇందులో పాయింట్ గా  తీసుకుంటే గతంలో ఎన్‌.టి.ఆర్‌., మోహన్‌బాబు తండ్రీకొడుకులుగా నటించిన కొండవీటి సింహం  ఇందులో కనిపిస్తుంది. కానీ మిగిలినవన్నీ నేటి ట్రెండ్‌కు తగినట్లుగా దర్శకుడు మలిచాడు.
ఇంకోవైపు కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమాలో విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సూర్య వంటివారిని పెట్టి మెస్మరైజ్‌ చేశాడు కమల్‌. ఇప్పుడు జైలర్‌లో దర్శకుడు రజనీకాంత్‌తోపాటు మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌ను పెట్టి మెస్మరైజ్‌ చేశాడు.
ఏది చేసినా సినిమా తీయాలంటే కుటుంబకథా చిత్రం తీయండి అందరూ చూడతగ్గ సినిమా కావాలంటూ సునీల్‌  హీరోగా తమన్నా ఐటెం డాన్స్ తర్వాత ఎపిసోడ్‌లో ఆ సినిమా డైరెక్టర్‌కు రజని చెప్పడం ఇప్పటి సినిమాలపై సెటైర్‌గా వుంటుంది.
 
ఇందులో నటీనటులంతా బాగా నటించాడు. తమన్నా ఐటెంసాంగ్‌ చేసింది. రజనీ భార్యగా రమ్యకృష్ణ నటించింది. ఆయన మనవడిగా చేసిన పిల్లాడు బాగా అలరించాడు. యోగిబాబు సీరియస్‌నెస్‌ కామెడీ రజనీతో సరదాగా అనిపిస్తుంది. ఇక మెంటల్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయిన సన్నివేశం కూడా అలరిస్తుంది. ఇలా అక్కడక్కడ కామెడీ పెడుతూ సీరియస్‌ మూడ్‌లోకి తీసుకెళ్ళిన జైలర్‌ సెకండదాఫ్‌లో లెంగ్త్‌ ఎక్కువయింది. యాక్షన్‌ పార్ట్‌ టెక్నికల్‌గా బాగుంది. తమన్నా ఐటెంసాంగ్‌ మినహా అస్సలు పాటలులేకుండా కథనంతో ఆకట్టుకునేలా చేశాడు దర్శకుడు. శివరాజ్‌కుమార్‌, జాకీష్రాఫ్‌, మోహన్‌లాల్‌ పాత్రలు ఈ సినిమాకు ప్రత్యేకత సంతరించాయి. మధ్యమధ్యలో కన్నడ, మలయాళం భాషల్లో కూడా చిన్నపాటి డైలాగ్స్‌ పెట్టడం సింబాలిక్‌గా వున్నాయి. వీరి పాత్రలే ట్విస్ట్‌గా వుంటాయి. ముగింపులోకూడా ఊహించని మలుపు వుంటుంది. అందుకే ఈసినిమా అందరికీ మెచ్చేలా వుంటుందనడంలో సందేహం లేదు.
 
2వ సగం యాక్షన్ ఎలిమెంట్స్‌లో ఎక్కువగా ఉంటుంది (మొదటి సగం యాక్షన్, ఫ్యామిలీ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌లో సమానంగా విభజించబడింది). హింస కొద్దిగా ఎక్కువ. ఇంటర్వెల్ యాక్షన్ సీన్ మరియు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతమైనవి (అనిరుధ్ అందించిన ప్రధాన సహకారం). రోబో మరియు 2.0 తర్వాత సూపర్ స్టార్ రజనీకి, ఆయన అభిమానులకు ఒక సంపూర్ణమైన ట్రీట్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిమాలయాలకు ప్రయాణమైన రజనీకాంత్.. అంతా దానికోసమే?