Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరితో ఒక్క రోజులో మంత్రిని చేస్తామన్నారు... సినీ నటి రమ్య

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (10:13 IST)
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల పదో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా కన్నడ నటి, సినీ నటి, మాజీ ఎంపీ రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే ఒక్క రోజులోనే మంత్రి పదవి ఇస్తానని బీజేపీకి చెందిన ఓ నేత ఆఫర్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించి కన్నడనాట కలకలం రేపారు. అయితే, తాను ఆ ఆఫర్‌ను అపుడే తిరస్కరించినట్టు చెప్పారు. 
 
మాండ్యా మాజీ ఎంపీ అయిన రమ్య గత 2019లో కాంగ్రెస్ సోషల్ మీడియాలో సెల్‌ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఆమె కూడా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో రమ్య మాట్లాడుతూ, తనకు బీజేపీపై వ్యతిరేకత లేదన్నారు. కొందరు నాయకులు, వారి సిద్ధాంతాలు మాత్రం ఏమాత్రం గిట్టవన్నారు. సినిమా నటులను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్తే నగదు పంచకుండానే ఓట్లు వచ్చేస్తాయని కొందరు నేతలు అనుకుంటున్నాని, నిజానికి సినిమా నటులు ప్రజాదారణ ఉన్న వ్యక్తుల ప్రచారానికి వచ్చినంత మాత్రాన ఓట్లు రాలవని రమ్య స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments