Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో చీతా చనిపాయె... నెల రోజుల్లో రెండో ఘటన

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (09:48 IST)
సౌతాఫ్రికా నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న 12 చీతా(చిరుత పులి)లలో మరో చిరుత పులి చనిపోయింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈ చీతాకు చికిత్స అందిస్తుంటగా ఆదివారం సాయంత్రం నాలుగుల సమయంలో ప్రాణాలు విడిచింది. గత నెల రోజుల్లో ఇది రెండో సంఘటన కావడం గమనార్హం. మార్చినా నమీబియా నుంచి భారత్‌కు వచ్చిన చీతా సాషా చనిపోయిన విషయం తెల్సిందే.
 
దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో వదిలిపెట్టారు. వీటిలో ఒకటి గత మార్చి నెలలో చనిపోగా, మరో చీతా ఆదివారం మృత్యువాతపడింది. చనిపోయిన చీతా మగ చిరుతపులి అని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జీఎస్ చౌహాన్ తెలిపారు. అనారోగ్యం బారినపడటంతో చికిత్స అందిస్తుండగా చనిపోయిందని తెలిపారు. అయితే, ఈ చీతా మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.  
 
ఉదయ్ అనే చీతా అనారోగ్యంతో బాధడుతున్నట్టు గుర్తించిన అటవీ అటవీ సిబ్బంది.. ఆ తర్వాత దానిని చికిత్స కోసం వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందింది. పశువైద్య బృందం దానికి పోస్టుమార్టం నిర్వహించింది. ఈ సందర్భంగా మొత్తం ప్రక్రియను వీడియోను తీశారు. 
 
కాగా, ఈ యేడాది ఫిబ్రవరి నెల 18వ తేదీన సౌతాఫ్రికా నుంచి 12 చీతాలను కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. అందులో గత యేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటైన నాషా ఈ యేడాది మార్చి నెలలో చనిపోయింది. ఇపుడు మరో చీతా మరణించడంతో అటవీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments