Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు కావాలా? నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా? ఏ తల్లీ చేయని పని చేసింది

mother
Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (22:15 IST)
ఏ తల్లీ చేయని దారుణానికి ఒడిగట్టింది ఆ తల్లి. తన కన్న కూతురునే కామాంధుడికి అప్పజెప్పింది. తనకు కావాల్సిన జల్సాలు తీరుస్తున్న వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ వాటికి తన కుమార్తె జీవితాన్ని బలి చేసింది. వివరాల్లోకి వెళితే.. అతడు తమిళనాడు అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.
 
పార్టీ అధికారంలో వుంటే కొందరికి కన్నూమిన్నూ కానరాదు కదా. ఇతడు కూడా అదేరకం. తనకు సాయం చేయాలంటూ వచ్చిన ఓ మహిళను మెల్లగా లొంగదీసుకున్నాడు సదరు మాజీ ఎమ్మెల్యే. ఆమెను రిసార్టులు, ఫామ్‌హౌస్‌లకు తిప్పి పూర్తిగా తనకు బానిసగా మార్చేసుకున్నాడు. ఐతే అతడితో ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఆమె తన వెంట 15 ఏళ్ల కుమార్తెను తీసుకెళ్లింది.
 
ఈ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. నీకంటే నీ కూతురు చాలా అందంగా ఉందనీ, ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ఉందన్నాడు. నువ్వు అడింది ఏనాడైనా కాదన్నానా అంటూ కుమార్తెను తీసుకెళ్లి ప్రియుడికి అప్పగించేసింది. ఆమెను ఆ కామాంధుడు రెండేళ్ల పాటు నిర్బంధంలో పెట్టి తన పశువాంఛను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలికను తన స్నేహితులకు అప్పగించాడు.
 
ఇది జరిగింది 2017లో కాగా ఈ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే నంజిల్ మురుగేషన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు అతడికి బెయిల్ ఇవ్వలేమని తిరస్కరించింది. కొసమెరుపు ఏంటంటే.. తన కుమార్తెను మాజీ ఎమ్మెల్యేకి అప్పగించిన సదరు మహిళ తన కుమార్తె కనబడటం లేదనీ, ఎవరితోనైనా వెళ్లిపోయిందేమోనని పోలీసు కేసు పెట్టింది. పోలీసులు తమదైన శైలిలో విచారించి చివరికి తల్లిని, ఆమె ప్రియుడు-మాజీ ఎమ్మెల్యేని కటకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments