Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటల్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. విశేషాలివే...

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (18:55 IST)
Atal Tunnel
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ను శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. హిమాలయ పర్వత సానువుల్లో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సొరంగ మార్గాన్ని 9.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి-లేహ్‌ జాతీయ రహదారిపై లాహౌల్‌-స్పిటీ జిల్లాలో రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద నిర్మించారు. 
 
గతంలో ఈ మార్గాన్ని రోహ్‌తంగ్ టన్నెల్ అని పిలిచేవారు. కానీ 2019 డిసెంబరు 24 తేదీన అటల్‌ టన్నెల్‌గా పేరు మార్చారు. దేశ ప్రధాని పదవిలో అటల్ బిహార్ వాజ్‌పేయీ ఉన్న సమయంలో అంటే 2000 జూన్‌ 3న ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత సరిగ్గా రెండేళ్ల తర్వాత అంటే 2002 మే 26 తేదీన ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
 
అయితే ఈ సొరంగ మార్గాన్ని అధికారులు ఆరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వాతావరణ పరిస్థితులు మరి కొన్ని కారణాలతో నిర్మాణం కాస్త ఆలస్యం అయింది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతో శనివారం ప్రధాని నరేంద్రమోడి దాన్ని ప్రారంభించారు. ఇక ఈ నిర్మాణంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కీలక పాత్ర పోషించింది.
 
ఈ సొరంగమార్గం విశేషాలు.. 
ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. 
ఈ సొరంగ మార్గంలో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్‌, 60 మీటర్లకు అగ్ని మాపక వ్యవస్థను కలిగివుంటుంది. 
ఇంకా 500 మీటర్లకు అత్యవసర మార్గం, 250 మీటర్లకు సీసీ కెమెరా,
2.2 కి.మీ.లకు వెలుతురు ప్రసరించే వ్యవస్థ, 1 కి.మీ.కు గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లాంటి సౌకర్యాలు ఉంటాయి. 
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గాల్లో ఇదే అత్యంత పొడవైంది. 
అంతే కాదు సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఈ సొరంగం ద్వారా సైనిక వాహనాల్లో సామగ్రిని త్వరితగతిన తరలించ డానికి వీలుగా ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments