Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు.. రాష్ట్రపతి ఆమోదం

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:45 IST)
సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం చేసిన సిఫార్సులకు.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు.
 
కొత్త న్యాయమూర్తుల్లో.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా.., గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కొలీజియం జాబితాలో ఉన్నారు.

వీరితోపాటు కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎంఎం సుందరేశ్‌, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం. త్రివేది, సీనియర్‌ అడ్వకేట్‌ పీఎస్​ నరసింహా ఉన్నారు. 

వీరంతా ఈ నెల  31న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా వుండగా తెలుగు వాడైన సీనియర్‌ అడ్వకేట్‌ పీఎస్​ నరసింహా సీజే అయ్యే అవకాశముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments